ఆలియా భట్ కంటే ముందే పెళ్లి.. మొదటి భార్యను కలవలేకపోయా అంటూ రణ్‌బీర్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారుతున్నాడు. గ్యాప్ లేకుండా ప్రమోషన్ చేస్తూ అన్ని భాషల్లో కూడా గుర్తింపు అందుకోవాలనే కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. దాదాపు ఒకేసారి బ్రహ్మాస్త్ర, షంషేరా సినిమాలను పూర్తి చేయడంతో రెగ్యులర్ ప్రమోషన్స్ లో పాల్గొనాలి వస్తోంది. ఇక రీసెంట్ గా రణ్‌బీర్ కపూర్ తన వైవాహిక జీవితంలోని ఒక విషయాన్ని తెలియజేశాడు. అలియా భట్ తన మొదటి భార్య కాదని ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. ఆ వివరాల్లోకి వెళితే..

రణ్‌బీర్ హిట్ కోడతాడా?
టాలెంటెడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఓపెనింగ్స్ అందుకుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గత కొంత కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, ఆయుష్మాన్ ఖురానా.. ఇలా టాలెంటెడ్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇక ఇప్పుడు జూలై 22వ తేదీన రాబోయే సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

విభిన్నమైన పాత్రల్లో
కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన షంషేరా సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులు అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా రణ్‌బీర్ కపూర్ ఈ సినిమాలో విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అతనికి సంబంధించిన లుక్స్ కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ హైప్ అయితే క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో వాణీ కపూర్ హీరోయిన్ గా నటించింది.

పెళ్లి తరువాత సినిమాలతో బిజీగా
రణ్‌బీర్ కపూర్ ఇటీవల తన ప్రేయసి ఆలియాభట్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి హడావుడి లేకుండా అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి అయినా కొన్ని రోజులకే రణ్‌బీర్ కపూర్ అలియా ఎలాంటి హాలిడే స్పాట్ కు వెళ్లకుండా వరుసగా సినిమా పనులతో బిజీ అయిపోయారు.

అలియా భట్ మొదటి భార్య కాదు
ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌బీర్ కపూర్ తన మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అనే విషయం గురించి మాట్లాడుతూ ఒక సరదా విషయాన్ని కూడా తెలియజేశాడు. అలియా భట్ తన మొదటి భార్య కాదు అని గతంలో జరిగిన ఒక సరదా సంఘటన గురించి నవ్వుతూ వివరణ ఇచ్చాడు.

అలా గేటుతో పెళ్లి
మా తల్లిదండ్రులతో నేను గతంలో కృష్ణరాజ్ బంగ్లా లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి మా ఇంటి గేటు దగ్గర చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. మా ఇంటి గేటుకు పూలదండ వేసి దానికి కుంకుమ బొట్టు కూడా పెట్టేసింది. అంతేకాకుండా తనకు నాకు పెళ్లి అయిపోయింది అంటూ అందరికీ చెప్పేసి వెళ్లిపోయిందట. ఆ విషయాన్ని నాకు వాచ్ మెన్ చెప్పగానే చాలా క్రేజీగా అనిపించింది.

ఇంకా ఆమెను కలవలేదు
ఆ విధంగా చూసుకుంటే నా మొదటి భార్యను నేను ఇంకా కలవలేదు అంటూ రణ్‌బీర్ కపూర్ సరదాగా వివరణ ఇచ్చాడు. దీంతో అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ విషయంపై ఆలియా ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. అయితే గతంలో ఆలియా రణ్‌బీర్ తో నటించక ముందే అతనితో డేటింగ్ చేయాలని ఉంది అని కూడా తెలియజేసింది. ఆమె కోరుకున్నట్లుగానే డైరెక్ట్ గా పెళ్లి చేసుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications











