twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2020లో క్రేజీ జంట పెళ్లి మిస్.. అలియా భట్‌తో వివాహాంపై రణ్‌బీర్ కపూర్ కామెంట్స్

    |

    కరోనా వైరస్ పుణ్యమా అని కొందరు ఆలోచనలో పడి ఓ నిర్ణయానికి వచ్చి మూడు ముళ్లు వేసి ఓ ఇంటి వారయ్యారు కొందరు సెలెబ్రిటీలు. ఇంకొందరు ఈ లాక్డౌన్ కాలంలో సంబంధాలు కుదుర్చుకుని వివాహాం చేసుకుని. ఇప్పట్లో కరోనా ఇక వెళ్లిపోయే పరిస్థితి లేదని తెలిసి.. ఏదో మూములుగా పెళ్లి చేసుకున్న వారు కొందరు. వీరంతా పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో ఉన్న వారే కాబట్టి కరోనా లాంటి పరిస్థితుల్లోనూ ఒక్కటయ్యారు. కానీ రణ్ బీర్ కపూర్ మాత్రం కరోనా వచ్చింది కాబట్టే అలియా భట్‌ను ఈ ఏడాది పెళ్లి చేసుకోలేదని తాజాగా చెప్పుకొచ్చాడు.

    సెలెబ్రిటీల పెళ్లిళ్లు..

    సెలెబ్రిటీల పెళ్లిళ్లు..

    2020 పాండమిక్ పరిస్థితుల్లోనూ సెలెబ్రిటీలు వివాహాలు చేసుకున్నారు. కరోనా ఉన్నా కూడా లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూనే తమ భాగస్వాములను పెళ్లాడారు. ముఖ్యంగా దక్షిణాదిలోనే ఎక్కువగా పెళ్లిళ్లు జరిగాయి. అందులోనూ టాలీవుడ్‌లోనే పెళ్లి సందడి కనిపించింది. రానా, నితిన్, నిఖిల్, నిహారికల పెళ్లిళ్లు ఎంతో ఘనంగా జరిగాయి.

    నార్త్ లోనూ..

    నార్త్ లోనూ..

    ఇక ముంబై వేదికగా కాజల్ అగర్వాల్ పెళ్లి జరిగింది. తన స్నేహితుడు, ప్రియుడు అయిన గౌతమ్ కిచ్లూని కాజల్ వివాహామాడింది. సింగర్ నేహా కక్కర్ పెళ్లి కూడా జరిగింది. ఇలా ఎంతో మంది కరోనా సమయంలో పెళ్లి పీటలు ఎక్కితే రణ్ బీర్ కపూర్ మాత్రం కరోనానే సాకుగా చూపించాడు.

    రణ్ బీర్ రాసలీలు..

    రణ్ బీర్ రాసలీలు..

    బాలీవుడ్ లవర్ బాయ్ రణ్ బీర్ కపూర్ తాజాగా తన పెళ్లి గురించి కామెంట్ చేశాడు. మామూలుగా ఈ లవర్ బాయ్‌కి ప్రేమ వ్యవహారాలు బాగానే కలిసి వస్తున్నాయి.కానీ అవి పెళ్లి పీటల వరకు ఎక్కడమే లేదు. దీపిక పదుకొణె, కత్రినా కైఫ్ వంటి వారితో రణ్ బీర్ పీకల్లోతు ప్రేమలో మునిగాడు. ఇప్పుడు మాత్రం అలియా భట్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు.

     కరోనాతో పెళ్లి వాయిదా..

    కరోనాతో పెళ్లి వాయిదా..

    నా గర్ల్ ఫ్రెండ్ అలియా నాకంటే ఎంతో సాధించింది. ఈ లాక్డౌన్ సమయంలో గిటార్ నేర్చుకుంది.. స్క్రీన్ ప్లే రైటింగ్ నేర్చుకుందంటూ అలియా గురించి రణ్ బీర్ కపూర్ చెప్పుకొచ్చాడు. ఇక అలియాతో పెళ్లి గురించి మాట్లాడుతూ.. ఒకవేళ 2020లో ఈ కరోనా రాకపోయి ఉంటే తామిద్దరం పెళ్లి చేసుకునే వాళ్లమని రణ్ బీర్ కపూర్ తాజాగా మాట్లాడాడు.

    English summary
    Ranbir kapoor about marriage with alia bhatt,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X