RRR హీరోయిన్ పెళ్లి ప్లాన్ క్యాన్సిల్.. భారీగా ప్లాన్ చేసుకున్న టైమ్‌లో స్టార్ హీరోకు బిగ్ షాక్!

బాలీవుడ్ లో పెళ్లి చేసుకోవడానికి కొంతమంది హీరో హీరోయిన్స్ ప్రస్తుతం రెడీగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్న ప్రేమలకు, రూమర్స్ కు శుభం కార్డ్ పెట్టాలని చూస్తున్న టైమ్ లో కొందరికి అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇక ఆ లిస్టులో RRR హీరోయిన్ కూడా ఉంది. గా రెండేళ్లుగా వాయిదా పడుతున్న ఆ బ్యూటీ వివాహం ఈసారి కూడా క్యాన్సిల్ అయినట్లే అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Recommended Video

Ranbir Kapoor Finally Calls Alia Bhatt His Girlfriend, Opens Upon Marriage

చీరలో ఎన్ని అందాలో.. ట్యాక్సీవాలా పిల్ల అస్సలు తగ్గట్లేదు

ఆ కారణంతో షూటింగ్ కు బ్రేక్

ఆ కారణంతో షూటింగ్ కు బ్రేక్

RRR లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ రామ్ చరణ్ కు జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు సతీమణిగా సీత అనే పాత్రలో నటిస్తున్న అలియా భట్ ఇటీవల కోవిడ్ 19 బారిన ఓడింది. దీంతో కొన్నిరోజుల పాటు ఆమె షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.

ఇద్దరికి ఒకేసారి కోవిడ్ రావడంతో

ఇద్దరికి ఒకేసారి కోవిడ్ రావడంతో

ఇక ఆమెతో పాటు బాయ్ ఫ్రెండ్ రణ్ బీర్ కపూర్ కు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు ఒకేసారి క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇక తొందరగానే కోలుకున్న వారు వీలైనంత త్వరగా ఈ సమ్మర్ లోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

ఏదో ఒక సమస్య ఎదురవుతోంది

ఏదో ఒక సమస్య ఎదురవుతోంది

నిజానికి వీరి పెళ్లి వ్యవహారం రెండేళ్ల నుంచి వాయిదా పడుతోంది. రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొనె తరహాలోనే ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ గా కొనసాగాలని అనుకున్నారు. కానీ ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతోంది. గత ఏడాది రణ్ బీర్ తండ్రి రిషి కపూర్ మరణం వల్ల పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది.

మరోసారి వాయిదా

మరోసారి వాయిదా

ఇక గత ఎడాది చివరలో పెళ్లికి ఏర్పాట్లు చేయాలని ఆలోచనలో ఉండగానే కరోనా వల్ల ధైర్యం చేయలేకపోయారు. ఇక ఈ సమ్మర్ లో కూడా వారి వివాహం జరిగే అవకాశం లేదట. కోవిడ్ తీవ్రత ముంబైలో మరింత ఎక్కువగా మారింది. అందుకే ఈ సమయంలో పెళ్లి మ్యాటర్ గురించి ఏ మాత్రం మాట్లాడుకోవద్దని ఇరు కుటుంబాల సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X