రణబీర్ కపూర్ తో అమీశా పటేల్ ఎఫైర్? స్పందించిన పవన్ కళ్యాణ్ హీరోయిన్
తెలుగులో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది అమీశా పటేల్. బాలీవుడ్ హీరోయిన్ గా అంచలంచెలుగా ఎదిగిన ఈ బ్యూటీ దేశ శ్యాప్తంగా మంచి క్రేజ్ ను దక్కించుకుంది. విభిన్న పాత్రలు పోషించి ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా అమీశా పటేల్ తన గురించి వస్తున్న డేటింగ్ వార్తలపై స్పందించింది. అవన్నీ అవాస్తవాలనీ చెప్పుకొచ్చింది.
అమీశా పటేల్ తెలుగు సినిమాలు..
బాలీవుడ్ బ్యూటీ అమీశా పటేల్ తెలుగు చిత్రాల్లోనూ గుర్తుండిపోయే సినిమాలు చేసింది. కెరీయల్ ప్రారంభంలోనే టాలీవుడ్ లో సినిమా అవకాశాలను అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'బద్రి' చిత్రంతో తొలిసారిగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. పవన్ కళ్యాణ్ కు ధీటుగా పెర్ఫామెన్స్ చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. 2001లో విడుదలైన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మహేశ్ బాబు సరసన 'నాని' చిత్రంతో మళ్లీ తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సరసన 'నరసింహుడు' అనే చిత్రంలోనూ నటించి మెప్పించింది.

అమీశా పటేల్ పై వచ్చిన రూమర్లు..
ముంబైలో పుట్టిన పెరిగిన అమీశా పటేల్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె వయస్సు 49 ఏళ్లు. మరో వచ్చే నెల 9వ తేదీతో 50వ ఏటా అడుగుపెడుతుంది. అయితే ఇప్పటి వరకు అమీశా పటేల్ బ్యాచిలర్ లైఫ్ నే లీడ్ చేసింది. ఈ క్రమంలో అమీశా పటేల్ పలువురితో డేటింగ్ లో ఉందంటూ కొన్నాళ్లుగా బాలీవుడ్ మీడియాలో ప్రచారం అవుతూనే ఉంది.
అమీశా పటేల్ ఇంత మందితో డేటింగ్ చేసిందా?
1999 నుంచి అమీశా పటేల్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ విక్రమ్ భట్ తో రిలేషన్ షిప్ స్టార్ట్ చేసింది. ఐదేళ్ల పాటు సిరీయస్ గా రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు వారి మధ్య పెళ్లి ప్రపోజల్స్ నడిచాయి. 2008లో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ విక్రమ్ భట్, అమీశా పటేల్ ఎవరూ ఊహించని విధంగా తమ బ్రేకప్ ను ప్రకటించారు. ఆ తర్వాత కనవ్ పూరీతో ఐదేళ్లపాటు డేటింగ్ లో ఉంది. ఆయనతోనూ విడిపోయింది. ఇదే క్రమంలో అమీశా పటేల్ రణబీర్ కపూర్ తో పాటు ప్రీతి జింటా మాజీ ప్రియుడు వ్యాపారవేత్త నెస్ వాడియాతోనూ ప్రేమ వ్యవహరం నడిపించిందంటూ వార్తలు వచ్చాయి.
క్లారిటీ ఇచ్చిన అమీశా పటేల్..
తొలుత ప్రీతి జింటా మాజీ ప్రియుడు నెస్ వాజిడాతో రిలేషన్ షిప్ పై అమీశా ఇలా క్లారిటీ ఇచ్చింది. అతను తన ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పింది. తమ మూడు తరాల కుటుంబాలు కలిసిమెలిసి ఉంటున్నామని తెలిపారు. తరుచూ ఒకరి ఇంట్లో మరొకరు కలుస్తూ ఉంటామని చెప్పింది. అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ లేదు. బహుశా మేం తరుచుగా కనిపించడం వల్ల అలాంటి రూమర్ వచ్చిందేమో అని చెప్పింది. ఇప్పటికీ తను మంచి స్నేహితుడని, నెస్ తండ్రి తమ కుటుంబానికి ఎంతో సహకారం అందించాడని చెప్పుకొచ్చింది. మరోవైపు రణబీర్ కపూర్ గురించి మాట్లాడుతూ.. గతంలో రణబీర్ తో ఇండస్ట్రీలో హై ప్రొఫైల్ ఈవెంట్స్ కు వెళ్తూ ఉండేవాళ్లం. రణబీర్ కపూర్ ఒక్కడే కాదు, సైఫ్ అలీ ఖాన్, తదితర సన్నిహితులు కూడా ఉండేవారు. ఎక్కువగా రణబీర్ ఆర్కే బంగ్లాలో కలిసేవాళ్లం. సినిమాలు చూసే వాళ్లమని, అంతకు మించి వేరేదేమీ లేదని వివరించింది.


Click it and Unblock the Notifications











