Ranbir Kapoor and Alia Bhatt Marriage: రాబోయే గెస్టులు.. సల్మాన్ తో పాటు వాళ్ళకు నో ఇన్విటేషన్?

గత కొన్ని రోజులుగా అలియా భట్ పెళ్లి కి సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. RRR సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అలియా భట్ త్వరలోనే యువ హీరో రణ్‌బీర్‌ కపూర్ ను వివాహం చేసుకోబోతున్నట్లు గా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఎన్ని కథనాలు వెలువడిన కూడా ఇంతవరకు ఈ జంట ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక వీరికి సంబంధించిన పెళ్లి డేట్ తో పాటు రాబోయే అతిథులు లిస్ట్ కూడా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక కొందరికి ఇన్విటేషన్ కూడా అందకపోవచ్చని తెలుస్తోంది.. ఆ వివరాల్లోకి వెళితే.

ఫ్యామిలీని ఒప్పించి..

ఫ్యామిలీని ఒప్పించి..

అలియా భట్ రణ్‌బీర్‌ కపూర్ గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరూ అనేకసార్లు ప్రేమకు సంబంధించిన కామెంట్స్ తో అందరికీ షాకిచ్చారు. అప్పుడప్పుడు స్పెషల్ పార్టీలు కూడా చేసుకుంటూ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఇక ఈ ఇద్దరు ఇటీవల ఇరు కుటుంబాల సభ్యులను ఒప్పించి వారి సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోవడానికి ప్రణాళికలు రచించి నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.

డేట్ ఫిక్స్

డేట్ ఫిక్స్

ఏప్రిల్ 17వ తేదీన వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా గత వారం రోజుల నుంచి బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ వార్తల డోస్ ఎంత పెరిగినా కూడా ఇంతవరకు రణ్‌బీర్‌ నుంచి గాని అలాగే అలియా నుంచి గాని ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. గతంలో వీరు పెళ్లికి అయితే ఇంకా టైం ఉంది అని చెప్పారు కానీ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేనట్లు ఇన్ డైరెక్ట్ చెప్పేశారు. కానీ బాలీవుడ్ మీడియాలో మాత్రం అందుకు సంబంధించిన కథనాలు చాలానే వైరల్ అవుతున్నాయి.

పెళ్లికి క్లోజ్ ఫ్రెండ్స్

పెళ్లికి క్లోజ్ ఫ్రెండ్స్

ముంబైలోనే కపూర్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక బంగ్లాలో వీరి వివాహం చాలా గోప్యంగా జరగనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. పెళ్లికి కేవలం అలియా భట్, రణ్‌బీర్‌ కపూర్ ఇద్దరికీ సన్నిహితంగా ఉండే వారిని మాత్రమే ఆహ్వానం పంపుతున్నట్లు సమాచారం. వీరి పెళ్ళికి భారీగా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

సల్మాన్, కత్రినా?

సల్మాన్, కత్రినా?

అయితే రణ్‌బీర్‌ కపూర్ ఆలియా భట్ పెళ్లి కి గతంలో గొడవ పడిన వారు వచ్చే అవకాశం లేనట్లు కథనాలు వెలువడుతున్నాయి. సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ ఇద్దరికి ఇన్విటేషన్ రాకపోవచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ కు ఇదివరకే రణ్ బీర్ కపూర్ కి గొడవ అయింది. అంతేకాకుండా కత్రినా కైఫ్ తో కూడా అతను లవ్ ట్రాక్ కొనసాగించే విషయం తెలిసిందే.

కానీ అలియా భట్ తో మాత్రం సల్మాన్ ఖాన్ కు మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో ఆలియా భట్ హీరోయిన్ గా నటించనుంది. మరోవైపు కత్రినా కైఫ్ తో ఆమె చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మరి ఈ రూట్లో వాళ్లిద్దరూ పెళ్లికి వస్తారేమో చూడాలి.

అలియా మాజీ బాయ్ ఫ్రెండ్?

అలియా మాజీ బాయ్ ఫ్రెండ్?

ఇక ఇండస్ట్రీలో అలియా భట్ కు సన్నిహితంగా ఉండే కొంతమంది యువ హీరోలు కూడా పెళ్లికి హాజరు కావచ్చని తెలుస్తోంది. ఇక సిద్ధార్థ మల్హోత్రా మాత్రం రావడం అనేది డౌట్ గానే ఉంది. గతంలో ఆలియా భట్ సిద్ధార్థ్ మల్హోత్రా మధ్యలో కూడా లవ్ ట్రామ్ కొనసాగినట్లు అలాగే వారు చాలా తక్కువ సమయంలోనే విడిపోయినట్లు గా కథనాలు వెలువడ్డాయి. అయినప్పటికీ ఈ ఇద్దరూ మంచి స్నేహితులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరి పెళ్లికి ఈ హీరోకు ఇన్విటేషన్ ఇస్తారో లేదో చూడాలి.

Recommended Video

Ranbir Kapoor Finally Calls Alia Bhatt His Girlfriend, Opens Upon Marriage | Filmibeat Telugu
ఆమె మాత్రం రాదు?

ఆమె మాత్రం రాదు?

ఇక ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ సెలబ్రెటీలు వచ్చినా కూడా ఒకరు మాత్రం రాకపోవచ్చు అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాదాపు స్టార్ హీరోయిన్స్ కల్ అందరితో కూడా రణ్ బీర్ అలియాలతో మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే కంగనా రనౌత్ మాత్రం తప్పకుండా హాజరు కాదు అని చెప్పవచ్చు. ఇదివరకే ఆమె అలియా బట్ట సినిమాలపై చాలాసార్లు సెటైర్ వేసింది. నెపోటీజమ్ కు సంబంధించిన కామెంట్స్ లో కూడా అలియాను ఉద్దేశిస్తూ ఆమె కొన్నిసార్లు విమర్శలు కూడా చేసింది. ఎవరు వచ్చినా రాకపోయినా కంగనా మాత్రం రాకపోవచ్చు అని చెబుతున్నారు.

More from Filmibeat

Read more about: ranbir kapoor alia bhatt
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X