Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అలియా, రణ్‌బీర్ డెస్టినేషన్ వెడ్డింగ్ రద్దు.. కొత్త ప్లాన్ ఇదేనట.. డిసెంబర్లో పెళ్లికి..
బాలీవుడ్లో అనుష్క-విరాట్ కోహ్లీ, దీపికా పదుకోన్-రణ్వీర్ సింగ్, ప్రియాంకచోప్రా-నిక్ జోనస్ జంటల తర్వాత రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ జంట పెళ్లి గురించి ఎక్కువగా చర్చ జరుగుతున్నది. అయితే ఎప్పడో జరుగాల్సిన పెళ్లి పలు కారణాలుగా వాయిదా పడింది. అయితే తాజాగా వీరిద్దరి పెళ్లి వ్యవహారం బాలీవుడ్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతున్నది. అయితే పెళ్లికి కూడా ముహుర్తాలు పెట్టడంతో వీరి కల్యాణం ఎప్పుడా అనే విషయంపై గుసగుసలు వినిపిస్తన్నాయి. ఇక రణ్‌బీర్, ఆలియా పెళ్లి ఎప్పుడు? ఎక్కడనే ప్రశ్నలకు సమాధానం ఇదే..
రిషికపూర్ అనారోగ్యం కారణంగా
గత కొద్దినెలల క్రితమే రణ్‌బీర్ కపూర్, అలియాభట్ పెళ్లి జరుగాల్సి ఉంది. కానీ రణ్‌బీర్ తండ్రి రిషి కపూర్ క్యాన్సర్ బారిన పడటం, అమెరికాలో చికిత్స జరగడంతో పెళ్లి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు రిషి ఆరోగ్యం బ్రహ్మండంగా ఉండటంతో రణ్‌బీర్ పెళ్లి విషయం మళ్లీ తెరపైకి వచ్చింది.
డిస్టినేషన్ వెడ్డింగ్ వద్దని..
బాలీవుడ్ మీడియా ప్రకారం.. రణ్‌బీర్, ఆలియాభట్ పెళ్లి డిసెంబర్ చివరి వారంలో వారం రోజులపాటు జరిగేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ముందుగా వీరి పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ప్లాన్ చేసినప్పటికీ.. పరిస్థితుల కారణంగా వాయిదా వేసినట్టు తెలుస్తున్నది. రానున్న పరిస్థితుల ఎలా ఉంటాయో అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సంప్రదాయ పెళ్లికే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
డిసెంబర్ 21న పెళ్లి
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. ఆలియా, రణ్‌బీర్ కపూర్ పెళ్లిని 21 డిసెంబర్‌గా నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ముంబై తరహాలో బాజా, బరాత్ మాదిరిగా ధూంధాంగా నిర్వహించాలనే ఆలోచనలో ఇరు కుటుంబాలు ఉన్నట్టు తెలుస్తున్నది. డిసెంబర్ 21వ తేదీ నుంచి కనీసం పెళ్లి వేడుకలను జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఆలియా, రణ్‌బీర్ కపూర్ కెరీర్..
ఇక ఆలియాభట్, రణ్‌బీర్ కెరీర్ విషయానికి వస్తే.. వీరిద్దరూ కలిసి బ్రహ్మాస్త్రలో నటిస్తున్నారు. ఇక అలియాభట్ గుంగూభాయ్ కథియావాడీ, సడక్ 2 చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే RRR మూవీ ఆమె ఖాతాలోనే ఉంది. ఇక రణ్‌బీర్ కపూర్ శంషేరా అనే చిత్రంలో నటిస్తున్నాడు.