సినీ ప్రేమ జంట పెళ్లి క్యాన్సిల్.. స్టార్ హీరోయిన్‌కు ఆ లోపం ఉండడమే కారణం.!

By Manoj

చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోన్న సినీ ప్రేమ జంటల్లో బాలీవుడ్ స్టార్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జోడీ ఒకటి. ఒకప్పుడు రహస్యంగా ప్రేమించుకున్న వీరిద్దరూ.. కొద్ది రోజుల క్రితం తమ బంధాన్ని బయట పెట్టేశారు. దీంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచారు. ఇక, అప్పటి నుంచి తరచూ ఏదో ఒక పని చేస్తూ హైలైట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జంట గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

సినిమాల్లోనే కాదు.. రియల్‌గానూ లవర్ బాయే

సినిమాల్లోనే కాదు.. రియల్‌గానూ లవర్ బాయే

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో రణ్‌బీర్ కపూర్ ఒకడు. ప్రముఖ నటుడు రిషీ కపూర్ కుమారుడిగా పరిచయం అయినా అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అదే సమయంలో హీరోయిన్లతో ప్రేమాయణం సాగిస్తూ లవర్‌ బాయ్‌గానూ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఎంతో మందితో అతడు డేటింగ్ చేసిన విషయం తెలిసిందే.

ఆ హీరోయిన్‌కు పెళ్లి.. ఈ భామతో ప్రేమాయణం

ఆ హీరోయిన్‌కు పెళ్లి.. ఈ భామతో ప్రేమాయణం

రణ్‌బీర్ కపూర్ గతంలో స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనేతో ప్రేమాయణం సాగించాడు. వాస్తవానికి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా ఈ జంట విడిపోయింది. అంతేకాదు, దీపిక.. రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత రణ్‌బీర్.. మరో బాలీవుడ్ భామ ఆలియా భట్‌తో లవ్ ట్రాక్ నడుపుతూ పెళ్లికి సిద్ధం అయ్యాడు.

అలాంటి ఫొటోలు చూసి ఇద్దరికీ పెళ్లి చేసేశారు

అలాంటి ఫొటోలు చూసి ఇద్దరికీ పెళ్లి చేసేశారు

కలిసి తిరగడం.. బహిరంగంగానే ముద్దులు పెట్టుకోవడం వంటి కారణాలతో కొంత కాలంగా రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జోడీ తరచూ వార్తల్లో నిలుస్తోంది. అదే సమయంలో వీళ్లిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారని అప్పట్లో ఓ వార్త జోరుగా ప్రచారం అయింది. దీనికి కారణం. వీళ్లిద్దరూ యాడ్ ఫిల్మ్ కోసం దిగిన ఫొటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టడమే.

ఆయన వల్లే అప్పడు వాయిదా.. ఇప్పుడిలా

ఆయన వల్లే అప్పడు వాయిదా.. ఇప్పుడిలా

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమకు పెద్దల అంగీకారం ఎప్పుడో లభించింది. దీంతో ఈ జంట పెళ్లికి రెడీ అవుతోంది. వాస్తవానికి వీళ్ల నిశ్చితార్థం కూడా ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ, గతంలో రిషి కపూర్ అనారోగ్యానికి గురి కావడంతో అది వాయిదా పడింది. ఇక, ఈ మధ్య మళ్లీ డేట్ ఫిక్స్ చేయాలనుకున్న సమయంలో ఆయన మరణించడంతో క్యాన్సిల్ అయింది.

ఆలియాలో లోపం... షాకిచ్చిన జ్యోతిష్యుడు

ఆలియాలో లోపం... షాకిచ్చిన జ్యోతిష్యుడు

ఇటీవల రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి గురించి ఓ జ్యోతిష్యుడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆలియా జాతకంలో లోపం ఉందని, దాని వల్ల వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నా ఎంతో కాలం కలిసుండరని చెప్పి ఆయన బాంబ్ పేల్చాడు. అయితే, దీనికి పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయని పేర్కొన్నాడు. దీంతో ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది.

Recommended Video

Ala Vaikunthapurramuloo Bollywood Remake,Star Hero Showing Intrest!
 సినీ ప్రేమ జంట పెళ్లి క్యాన్సిల్ అయినట్లేనా

సినీ ప్రేమ జంట పెళ్లి క్యాన్సిల్ అయినట్లేనా

తాజాగా బాలీవుడ్ మీడియాలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి గురించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారనేదే దాని సారాంశం. జాతక ప్రభావం, రిషి కపూర్ మరణం వంటి కారణాలతో కొన్నేళ్ల పాటు పెళ్లికి దూరంగా ఉండబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అది ఎంత కాలం అన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X