రణ్‌బీర్, ఆలియా యూరోప్ దానికోసమే వెళ్ళారా..?
హీరో హీరోయిన్ ప్రేమలో ఉన్నారని తెలిస్తే చాలు.. వారి చుట్టే చేరతాయి కెమెరాలన్నీ. ఆ ఇద్దరూ ఎక్కడికెళ్లినా ఫాలో అవుతూ వారి వారి ప్రతీ సందర్భాన్ని అనుక్షణం వెంటాడుతూనే ఉంటాయి కెమెరా కళ్లు. ఈ మేరకు వారి ప్రేమ, పెళ్లి సంగతుల గురించిన అప్‌డేట్స్ బయటకొస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమాయణం, పెళ్లి పై ఓ వార్త తెగ చెక్కర్లు కొడుతోంది.
ఈ నేపథ్యంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ విదేశీ ప్రయాణం చర్చలకు దారి తీస్తోంది. రొమాంటిక్ టూర్‌లో భాగంగా యూరోప్ వెళ్లారు రణ్‌బీర్, ఆలియా జోడీ. దీంతో గత కొద్ది రోజులుగా డేటింగ్ చేస్తున్న ఈ హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకునేందుకే యూరోప్ వెళ్లారని, అక్కడి ఓ అందమైన లొకేషన్‌లో పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.

ఇటీవలే ఆలియా భట్ పెళ్లి విషయమై ఆమె తల్లి సోని స్పందించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఆలియా చాలా పెద్దయిందని, పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఆమెకే ఇస్తున్నాం అని సోని పేర్కొనడంతో ఇక రణ్‌బీర్, ఆలియా పెళ్లి పక్కా అని ఫిక్స్ అయ్యారంతా. ఇప్పటికే సోనమ్ కపూర్, దీపిక పదుకొనే, కత్రినా కైఫ్ లతో ప్రేమాయణాలు సాగించిన రణ్‌బీర్ కపూర్ ఇక ఆలియాను పెళ్లి చేసుకోవడం ఖాయం అంటున్నారు. 2019 చివర్లో రణ్‌బీర్, ఆలియాల పెళ్ళికి అంత సిద్ధమైపోయింది. యూరోప్ లోనే ఈ పెళ్లి జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ తొలిసారి బ్రహ్మాస్త్ర సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా బ్రహ్మస్త్ర మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ లో ఆలియా హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











