అభిమానులకు షాక్..రణ్‌బీర్-ఆలియా పెళ్లి మరోసారి వాయిదా.. చివరి నిముషంలో ఏమైందంటే?
చాలా కాలం నుంచి ప్రేమలోనే ఉన్న బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి హజరయ్యే బాలీవుడ్ సెలబ్రెటీలు వీరేనని, కొంతమందికే వీరి నుంచి ఆహ్వానాలు అందాయని బీ-టౌన్‌లో గుసగుసలు కూడా మొదలయ్యాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వీరి వివాహం వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త ప్రచారం మొదలాయింది. ఆ వివరాలు

వాయిదా పడి
రణ్‌బీర్ కపూర్ ఆలియా భట్ పెళ్లి గురించి ఓ ఆసక్తికరమైన వార్త రోజుకొకటి బయటకు వస్తూనే ఉంది. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న వీరి వివాహం ఎట్టకేలకు ఈ నెల 14న జరగబోతుందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఈ వేడుక వాయిదా పడిందని తెలిసింది. ఈ విషయాన్ని ఆలియా బ్రదర్ రాహుల్‌భట్ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

ఏప్రిల్ 14న
అలియా భట్ పెళ్లి వాయిదా పడిన విషయాన్ని అలియా సోదరుడు రాహుల్ భట్ తెలిపారు. ఒక వెబ్‌సైట్‌తో సంభాషణలో, నటి సోదరుడు పెళ్లికి అన్ని సన్నాహాలు చేసిన తర్వాత కూడా వివాహం వాయిదా పడిందని చెప్పారు. ఏప్రిల్ 14న పెళ్లి జరగనుందని గతంలో అలియా మేనమామ రాబిన్ మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే ఇప్పుడు అది ప్రస్తుతానికి వాయిదా పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

వాయిదా వేస్తున్నట్లు
మంగళవారం ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ దీనిపై స్పష్టమైన సమాచారం ఇచ్చారు. ఇప్పుడు పెళ్లి ఏప్రిల్ 14న జరగడం లేదని, ఏప్రిల్ 13న కూడా ఎలాంటి వేడుక లేదని రాహుల్ చెప్పారు. కుటుంబ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లిని వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇంకా ఫైనల్ డేట్ ఫిక్స్ చేయలేదని వెల్లడించారు.

మాట్లాడవద్దని
మీడియాలో తేదీలు లీక్ కావడంతో పెళ్లి వాయిదా పడిందని రాహుల్ తెలిపారు. పెళ్లి జరగడం గురించి అందరికీ తెలిసిందే కానీ ఏప్రిల్ 13, 14 తేదీల్లో పెళ్లి లేదు.. అది ఖచ్చితం అని వెల్లడించారు. అయితే ఇదిలా ఉంటే, ఈ విషయంపై అలియా భట్ తండ్రి మహేష్ భట్‌ను అడగగా, దానిపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించాడు. ఒక మీడియా కథనం ప్రకారం, పెళ్లి తేదీల గురించి ఆయనని అడిగినప్పుడు, "దాని గురించి బహిరంగంగా మాట్లాడవద్దని రణబీర్ కపూర్ తల్లి నటి నీతూ కపూర్ నన్ను అడిగారు. కాబట్టి నేను ఆమె మాట మేరకు ఎలాంటి విషయాలు బయట మాట్లాడడం లేదని ఆయన వెల్లడించారు.

అందుకే వాయిదా
పెళ్లి విషయంలో ఎంత గొప్యత పాటించినా ఆ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో సెక్యురిటీ దృష్ట్యా మహెందీ, హల్ది, నుంచి మిగిలి కార్యక్రమాలన్నింటినీ మార్పు చేశారు. అంతే కాక ఈ జంట తమ పెళ్లికి ఒక రోజు ముందు మీడియా మరియు అభిమానుల కోసం తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటిస్తారని రాహుల్ భట్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ- 'నాకు తెలిసినంత వరకు, తేదీకి సంబంధించి త్వరలో ప్రకటన వెలువడుతుంది. అలాగే రణబీర్-ఆలియాల వివాహం వచ్చే వారం ఏప్రిల్ 20 న జరగవచ్చని ఆయన చెప్పాడు.


Click it and Unblock the Notifications











