ఆలియా - రణ్‌బీర్ మధ్యలోకి దీపిక: బ్రేకప్ తర్వాత మళ్లీ కలిసిన జంట.. బాలీవుడ్‌లో హాట్ టాపిక్!

కొంత కాలంగా కలిసి తిరుగుతూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు బాలీవుడ్ కపుల్ రణ్‌బీర్ కపూర్ - ఆలియా భట్. చాలా కాలం పాటు రహస్యంగా ప్రేమాయణం సాగించిన ఈ జంట.. ఈ మధ్య బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తోంది. అంతేకాదు, తమ బంధాన్ని పెళ్లి పీటల వరకూ తీసుకెళ్లబోతోంది. ఇందులో భాగంగానే పెళ్లికి ముహూర్తాలు కూడా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆలియా - రణ్‌బీర్ మధ్యలోకి స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే వచ్చింది. దీంతో బ్రేకప్ తర్వాత తొలిసారి వీళ్లిద్దరూ కలిసినట్లైంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

Recommended Video

Anaganaga O Athidhi : నాకు కత్రినా కైఫ్ కంటే రాధిక ఆప్టే లా ఉండటమే ఇష్టం... Payal Rajput

Photos: Deepika Padukone's Birthday Dinner Party

చాక్లెట్ బాయ్‌కు చాలానే లవ్ స్టోరీలు

చాక్లెట్ బాయ్‌కు చాలానే లవ్ స్టోరీలు

కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతూ తన హవాను చూపిస్తున్నాడు చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్. రిషీ కపూర్ కుమారుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అద్భుతమైన టాలెంట్‌తో తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని సత్తా చాటాడు. కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయిన అతడు.. హీరోయిన్లతో ప్రేమాయణాలు సాగిస్తూ తరచూ వార్తల్లో నిలిచేవాడు.

దీపికతో బ్రేకప్.. ఆలియాతో లవ్ ట్రాక్

దీపికతో బ్రేకప్.. ఆలియాతో లవ్ ట్రాక్

ఇప్పటి వరకు రణ్‌బీర్ కపూర్ ఎంతో మంది హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. వాళ్లందరిలో స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనేను పెళ్లి చేసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా బ్రేకప్ చెప్పేశాడు. ఆ తర్వాత దీపిక.. రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత రణ్‌బీర్.. మరో బాలీవుడ్ భామ ఆలియా భట్‌తో ప్రేమాయణం సాగించడం మొదలు పెట్టాడు.

పెళ్లి గెటప్‌లో ప్రేమజంట.. అదేనంటూ

పెళ్లి గెటప్‌లో ప్రేమజంట.. అదేనంటూ

చాలా రోజుల పాటు సీక్రెట్‌గా ట్రాక్ నడిపిన రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్.. కొన్నేళ్ల క్రితం తమ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు ఒప్పుకున్నారు. ఆ తర్వాత కలిసి తిరగడం.. బహిరంగంగానే ముద్దులు పెట్టుకోవడం వంటి కారణాలతో కొంత కాలంగా ఈ జోడీ దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. యాడ్ ఫిల్మ్‌కు సంబంధించిన ఫొటోలు బటయకు రావడంతో వీళ్లు నిజంగా పెళ్లి చేసుకున్నారు.

Deepika Padukone's Birthday Dinner Party Photos

సీక్రెట్ టూర్.. దాని కోసం అనుకుంటే

సీక్రెట్ టూర్.. దాని కోసం అనుకుంటే

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా.. అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గత డిసెంబర్ చివర్లో ఈ జంట రహస్యంగా జైపూర్ చెక్కేసింది. దీంతో అక్కడ ఎంగేజ్‌మెంట్ జరుపుకోవడం కోసమే వీళ్లిద్దరూ వెళ్లారని ప్రచారం జరిగింది. కానీ, న్యూ ఇయర్ పార్టీ కోసమే వాళ్లు వెళ్లినట్లు క్లారిటీ వచ్చింది.

ఆలియా - రణ్‌బీర్ మధ్యలోకి దీపిక

ఆలియా - రణ్‌బీర్ మధ్యలోకి దీపిక

జైపూర్‌లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకుని రెండు రోజుల క్రితమే ముంబై చేరుకున్నారు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్. ఇలాంటి సమయంలో మంగళవారం రాత్రి స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే పుట్టినరోజు వేడుకల కోసం వాళ్లిద్దరూ ఆమె ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా బ్లాక్ డ్రెస్ వేసుకుని వెళ్లిన ఈ జంటకు.. దీపిక - రణ్‌వీర్ ఘన స్వాగతం పలకడంతో పాటు తెగ ఎంజాయ్ చేశారు.

బ్రేకప్ తర్వాత మళ్లీ కలిసిన పాత జంట

బ్రేకప్ తర్వాత మళ్లీ కలిసిన పాత జంట

దీపికతో రణ్‌బీర్ విడిపోయిన తర్వాత మరోసారి వీళ్లిద్దరూ కలిసింది లేదు. ఆ మధ్య ఓ పార్టీలో మీట్ అయ్యారని ప్రచారం జరిగినా అది అసత్యమేనని తేలింది. సరిగ్గా అప్పుడే తన టాటూను కూడా తొలగించింది దీపిక. దీంతో వీళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయనుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా పార్టీలో పాత ప్రేమికులు కలవడం బీ టౌన్‌లో హాట్ టాపిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X