ప్రియుడితో కలిసి చెక్కేసిన ఆలియా భట్: రహస్యాన్ని లీక్ చేసి షాకిచ్చిన రణ్‌బీర్ బాబాయ్

అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లో హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాకులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొద్ది రోజుల పాటు ప్రేమాయణం సాగించడం.. నచ్చితే పెళ్లి చేసుకోవడం.. లేకుంటే విడిపోవడం వంటివి అక్కడ సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు ఐదేళ్లుగా లవ్ ట్రాక్ నడుపుతూ తమ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు ఆలియా భట్ - రణ్‌బీర్ కపూర్. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీళ్లిద్దరూ తాజాగా ఓ సీక్రెట్ టూర్ వెళ్లారు. దీంతో వీళ్ల ఎంగేజ్‌మెంట్ జరుగుతుందనుకున్నారంతా. ఈ నేపథ్యంలో అసలు రహస్యం లీకైంది. వివరాల్లోకి వెళ్తే...

రియల్ లైఫ్‌లోనూ లవర్ బాయ్‌గా పేరు

రియల్ లైఫ్‌లోనూ లవర్ బాయ్‌గా పేరు

బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఉంటూ తన హవాను చూపిస్తున్నాడు చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్. ప్రముఖ నటుడు రిషీ కపూర్ కుమారుడిగా పరిచయం అయినా తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని సత్తా చాటాడు. కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయిన అతడు.. హీరోయిన్లతో ప్రేమాయణం సాగిస్తూ తరచూ వార్తల్లో నిలిచేవాడు. ఈ క్రమంలోనే లవర్ బాయ్ అనే పేరు తెచ్చుకున్నాడు.

ఆమెతో బ్రేకప్.. ఆలియా భట్‌తో డేటింగ్

ఆమెతో బ్రేకప్.. ఆలియా భట్‌తో డేటింగ్

సుదీర్ఘ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో లవ్ ట్రాక్ నడిపాడు రణ్‌బీర్ కపూర్. అయితే, వీరిలో స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనేను పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా ఈ జంట విడిపోయింది. అంతేకాదు, దీపిక.. రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత రణ్‌బీర్.. మరో బాలీవుడ్ భామ ఆలియా భట్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలు పెట్టాడు.

పెళ్లి ఫొటోలు చూసి నిజమేనని ప్రచారం

పెళ్లి ఫొటోలు చూసి నిజమేనని ప్రచారం

తమ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు ఒప్పుకున్నారు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్. ఆ తర్వాత కలిసి తిరగడం.. బహిరంగంగానే ముద్దులు పెట్టుకోవడం వంటి కారణాలతో కొంత కాలంగా ఈ జోడీ దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. అ సమయంలో వీళ్లిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారని ప్రచారం అయింది. దీనికి కారణం. వీళ్లిద్దరూ యాడ్ ఫిల్మ్ కోసం దిగిన పెళ్లి ఫొటోలే.

ఆయన వల్లే వాయిదా.. దాని వల్ల లేట్

ఆయన వల్లే వాయిదా.. దాని వల్ల లేట్

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమకు పెద్దల అంగీకారం ఎప్పుడో లభించింది. దీంతో ఈ జంట పెళ్లికి రెడీ అవుతోంది. వాస్తవానికి వీళ్ల నిశ్చితార్థం కూడా ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ, గతంలో రిషి కపూర్ అనారోగ్యానికి గురి కావడంతో ఒకసారి, ఆయన మరణంతో మరోసారి వాయిదా పడింది. దీంతో ఈ ఏడాదే జరగాల్సిన వీళ్ల పెళ్లి కూడా ఆలస్యం అయింది.

కలిసి చెక్కేసిన ఆలియా భట్ - రణ్‌బీర్

కలిసి చెక్కేసిన ఆలియా భట్ - రణ్‌బీర్

2020లోనే వివాహ బంధంతో ఒక్కటవుతారనుకున్న ఆలియా భట్ - రణ్‌బీర్ కపూర్ ఇప్పటి వరకు నిశ్చితార్థం కూడా చేసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జంట రహస్యంగా జైపూర్ చెక్కేసింది. దీంతో అక్కడ ఎంగేజ్‌మెంట్ జరుపుకోవడం కోసమే వీళ్లిద్దరూ వెళ్లారని ప్రచారం జరిగింది. అంతేకాదు, బుధవారం ఈ జంటకు నిశ్చితార్థం జరుగుతుందని జోరుగా వార్తలు వస్తున్నాయి.

రహస్యాన్ని లీక్ చేసి షాకిచ్చిన రణ్‌ధీర్

రహస్యాన్ని లీక్ చేసి షాకిచ్చిన రణ్‌ధీర్

ఆలియా భట్ - రణ్‌బీర్ కపూర్ సీక్రెట్ టూర్ తాలూకు రహస్యం లీక్ అయింది. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన రణ్‌ధీర్ కపూర్ (రణ్‌బీర్ బాబాయ్) ‘వాళ్లిద్దరూ జైపూర్ వెళ్లింది న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసమే. అది కూడా అందరికీ తెలిసే వెళ్లారు. ఒకవేళ నిశ్చితార్థం కోసమే అయితే నేను కూడా అక్కడే ఉంటా కదా' అని క్లారిటీ ఇచ్చారు. దీంతో వాళ్ల ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X