మళ్లీ రణ్‌బీర్, దీపికా పదుకోన్ జంటగా.. నాలుగేళ్ల తర్వాత మాజీ ప్రియుడితో రొమాన్స్
బాలీవుడ్‌లో అత్యంత రొమాంటిక్ జంటల్లో రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకోన్ జంట ఒకటి చెప్పుకోవచ్చు. దర్శకుడు ఇంతియాజ్ అలీ రూపొందించిన తమాషా చిత్రంలో వారిద్దరి కెమిస్ట్రీ తెరపైన అదరగొట్టిందనే సంగతి తెలిసిందే. అలాంటి జంట ప్రేమలో పడి విడిపోయింది. అప్పటి నుంచి వారిద్దరూ కలిసి నటించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం రణ్‌వీర్ కపూర్‌తో పెళ్లి తర్వాత మళ్లీ ఈ జంట కనువిందు చేయబోతున్నది.
దాదాపు నాలుగేళ్ల తర్వాత దీపికా పదుకోన్, రణ్‌బీర్ కపూర్ మళ్లీ తెర మీద జంటగా కనిపించబోతున్నారు. దర్శకుడు లవ్ రంజన్ రూపొందించే తదుపరి చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్టు బాలీవుడ్ పత్రికలు కథనాలు వచ్చాయి. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ కీలక పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది.

రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకోన్ కలిసి నటించిన చిత్రం యే జవానీ హై దీవాని 2013లో ఘన విజయం సాధించడంతో బాలీవుడ్‌లో క్రేజీ జంటగా పేరు తెచ్చుకొన్నది. 2015లో తమాషా చిత్రంలో వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది.


Click it and Unblock the Notifications











