Animal Pre Teaser: గొడ్డలితో రణ్‌బీర్‌ కపూర్‌ ఊచకోత.. యాక్షన్ డోస్ మామూలుగా లేదు

బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్, టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న చిత్రం యానిమల్. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ది మోస్ట్ వైలెంట్ సినిమాగా తెరకెక్కుతుంది. సందీప్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ... అందరూ కబీర్ సింగ్ ను వైలెంట్ ఫిలిం అంటున్నారు... అసలైన వైలెంట్ సినిమా అంటే ఏంటో నా తర్వాతి సినిమాలో చూపిస్తా అని బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. చెప్పినట్టుగానే అసలైన వైలెంట్ ఫిలిమ్ చూపించబోతున్నట్లు తెలుస్తుంది.

తాజాగా చిత్రబృందం ఈ సినిమా ప్రీ టీజర్ ను రిలీజ్ చేసింది. యానిమల్ మూవీ ప్రీ టీజర్ మొత్తం 50 సెకన్ల నిడివితో ఉంది. ముందుగా మాస్కులు వేసుకున్న కొందరు కనిపిస్తారు. ఆ తర్వాత ఓ పంజాబీ సాంగ్‍ ను కొందరు పడుతూ ఉండగా... ఆ బ్యాక్‍ గ్రౌండ్‍ లో అప్పుడు హీరో రణబీర్ కపూర్ పంచెకట్టులో ఎంట్రీ ఇస్తాడు.

Ranbir Kapoor animal Pre teaser stunning action scenes

మాస్కులు వేసుకున్న గ్రూప్‍ ను గొడ్డలితో నరుకుతూ వస్తాడు. ఈ నరుకుడే చివరి వరకు ఉంటుంది. మొత్తం రక్త పాతం కనిపిస్తుంది. చివరగా రణబీర్ కపూర్ ఫేస్ కనిపిస్తుంది. మొత్తంగా ఓ మోస్ట్ వైలెంట్ మూవీని సందీప్ వంగా తీసుకొస్తున్నారని అర్థమైపోయింది.

ప్రీ టీజర్ తోనే సినిమాపై తిరుగులేని హైప్ ఏర్పడిందను చెప్పాలి. త్వరలో టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా రిలీజ్ కు రెండు నెలల టైమ్ ఉందని చెబుతూ ఈ సినిమా ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తు్ంది. బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్.. రణ బీర్ కు ఫాదర్ గా కనిపించనున్నాడు.

ఇటీవలే రణ్‌బీర్‌ కపూర్‌ కు సంబంధించిన కొన్ని ఫోటోలు లీకై నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అందులో క్లీన్ షేవ్ తో ఉన్న రణ బీర్‌ లుక్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రణ బీర్‌ ఫిజిక్స్ లెక్చరర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 11న హిందీతో పాటు తెలుగు, తమిళ, పలు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చూడాలి ఇక.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X