twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంజూ టీజర్.. అదరగొట్టేసిన రణ్‌బీర్. అచ్చం సంజయ్‌దత్‌ మాదిరిగానే..

    By Rajababu
    |

    సినీ అభిమానులు, సంజయ్ దత్, రణ్‌బీర్ కపూర్ ఫ్యాన్స్ ఎదురు చూసిన సంజు మూవీ టీజర్ వచ్చేసింది. ఈ టీజర్‌లో రణ్‌బీర్ లుక్స్ పరంగానే కాకుండా హావభావాలతో అదరగొట్టేశాడు. సంజయ్ దత్ జీవితంలోని భిన్న రకాల గెటప్స్‌తో అదరగొట్టేశాడు. అయితే ఈ టీజర్‌లో కేవలం సంజయ్ రూపంలో ఉండే రణ్‌బీర్ కపూర్ మాత్రమే కనిపిస్తాడు. మిగితా ఏ ఒక్క నటి గానీ, నటుడు గానీ కనిపించరు. ఈ చిత్రంలో అనుష్కశర్మ, సోనమ్ కపూర్, మనీషా కోయిరాలా, దియా మిర్జా, కరీష్మా తన్నా, దియా మిర్జా తదితరులు నటించారు. ఈ చిత్రం జూన్ 29న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

    సంజూ టీజర్‌ను దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రెగ్యులర్‌గా తీసే సినిమాల కంటే బయోపిక్ చేయడం సవాల్‌తో కూడినది. స్క్రిప్టు రూపొందించడం కత్తి మీద సాముగా మారింది. సంజయ్ దత్ జీవితం వివాదాలమయమే కాకుండా స్ఫూర్తిని కలిగిస్తుంది. అలాంటి కఠినమైన జీవితాన్ని తెరకెక్కించడమంటే ఆషామాషీ కాదు అని రాజ్ కుమార్ హిరాణీ అన్నారు.

    English summary
    Much awaited teaser of Sanjay Dutt’s biopic titled Sanju was released on Tuesday. Directed by Rajkumar Hirani, Sanju has Ranbir Kapoor playing the titular role and has an ensemble cast of Sonam Kapoor, Manisha Koirala, Paresh Rawal, Anushka Sharma, Dia Mirza and Vicky Kaushal. After watching the short teaser, one can definitely root for the biopic being one of the best Bollywood has produced in the recent past.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X