ఆ సన్నివేశాలు చూడలేక.. మాజీ ప్రియుడు దూరంగా ఉండిపోయాడు!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ జీరో. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఆశించిన రెస్పాన్స్ రావడం లేదు. షారుఖ్ పరాజయాల పరంపరని ఈ చిత్రం కొనసాగించేలా కనిపిస్తోంది. కనీసం 100 కోట్లు దాటేందుకు కూడా ఆపసోపాలు పడుతోంది. షారుఖ్ క్రేజ్, కత్రినా గ్లామర్, అనుష్క శర్మ అప్పియరెన్స్ కూడా ఈ చిత్రాన్ని కాపాడలేక పోయింది. చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ఈచిత్రాన్ని వీక్షించిన షారుఖ్, కత్రినా నటనకు ప్రశంసలు కురిపించారు. కానీ రణబీర్ కపూర్ పై వస్తున్న వార్తలు ఆసక్తిరేకెత్తిస్తున్నాయి.

బబితా కుమారి
కత్రికా కైఫ్ ఈ చిత్రంలో బబితా కుమారిగా సినీ నటి పాత్రలో నటించింది. మద్యానికి బానిసగా మారిన స్టార్ హీరోయిన్ పాత్రలో కత్రినా మంచి నటన కనబరిచింది. సినీ క్రిటిక్స్ కూడా కత్రినా పాత్రపై ప్రశంసలు కురిపించారు. ప్రేమలో విఫలమైన హీరోయిన్ గా కత్రినా పాత్ర ఉంది. కత్రినా పోషించిన బబితా కుమారి పాత్రకు ఆమె నిజజీవితానికి ముడిపెడుతూ అనేక ఊహాగానాలు ప్రచారం జరుగుతున్నాయి.

రణబీర్ కపూర్‌తో బ్రేకప్
రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ చాలా కాలం పాటు సహజీవనం చేశారు. గుట్టుగానే ప్రేమాయణాన్ని సాగించారు. ప్రేమ విషయాన్ని ఎప్పుడూ మీడియాకు వెల్లడించకపోయినా వీళ్లిద్దరి ప్రైవేట్ ఫోటోలు లీక్ అయి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. 2016లో విభేదాలతో కత్రినా, రణబీర్ విడిపోవడం హాట్ టాపిక్ గా మారింది. అప్పటి నుంచి కత్రినా ఒంటరిగానే ఉంటోంది. ఈ సంఘటనల ఆధారంగానే జీరో చిత్రంలో కత్రినా పాత్రని రూపొందించారట.

ఆ సన్నివేశాలు చూడలేక
మొదట రణబీర్ కపూర్ జీరో చిత్రాన్ని ఆసక్తి చూపించాడట. కానీ ఈ చిత్రంలో కత్రినాతో బ్రేకప్ అయిన సన్నివేశాలు ఉన్నాయని సన్నిహితులు చెప్పడంతో ఆ ఆలోచనని విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో కూడా జీరో చిత్రాన్ని చూడకూడదనే ఉద్దేశంలో రణబీర్ కపూర్ ఉన్నాడట. తన నిజజీవితాన్ని పోలిన సన్నివేశాలు జీరోలో పెట్టడంపై రణబీర్ కాస్త గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది.

దీపికా పదుకొనె కూడా
ఈ బాలీవుడ్ క్రేజీ హీరో మాజీ ప్రేయసిల జాబితాలో దీపికా పదుకొనె కూడా ఉంది. రణబీర్ తన మ్యారేజ్ రిసెప్షన్ కు డుమ్మా కొట్టడంపై దీపికా ఘాటు వ్యాఖ్యలే చేసింది. అతడి మనస్తత్వమే అంత. దానికి ఎవరేం చేస్తారు అంటూ నేరుగా మీడియాతోనే వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ లవర్ బాయ్ ప్రస్తుతం అలియా భట్ తో ప్రేమలో మునిగి తేలుతున్నాడు.


Click it and Unblock the Notifications











