For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  హాట్ టాపిక్: ఆ హీరోయిన్‌తో సంబంధాన్ని ఒప్పేసుకున్న స్టార్ హీరో!

  By Bojja Kumar
  |
  Ranbir Kapoor Confirms Relation With Alia Batt

  బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. హీరోయిన్ అలియా భట్‌తో రణబీర్ డేటింగ్ చేస్తున్నాడని, ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని ఆ వార్తల సారాశం. ఈ మధ్య తరచూ ఈ జంట చట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటం, పార్టీల్లో దర్శనమిస్తుండటంతో ఇద్దరి మధ్య ఏదో 'సం'బంధం మొదలైంది అనే అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయింది. తాజాగా ఈ వార్తలపై రణబీర్ కపూర్ స్పందించారు.

   ఆమెతో సంబంధం నిజమే అని ఒప్పుకున్న రణబీర్

  ఆమెతో సంబంధం నిజమే అని ఒప్పుకున్న రణబీర్

  జిక్యూ మేగజైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ కపూర్‌కు అలియా భట్‌తో డేటింగ్ గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నపై స్పందిస్తూ... ‘ఇది నిజంగా కొత్తగా ఉంది. అయితే దాని గురించి ఇపుడే మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఇంకా సమయం ఉందని అనుకుంటున్నాను.' అని చెప్పడం ద్వారా తమ రిలేషన్ గురించి ఒప్పేసుకున్నాడు రణబీర్ కపూర్.

  అలియా గురించి గొప్పగా చెప్పిన రణబీర్

  అలియా గురించి గొప్పగా చెప్పిన రణబీర్

  వర్క్ విషయంలో, నటన విషయంలో, చివరకు జీవితం విషయంలో.... అలియా నాకు చాలా నచ్చింది. ఆమెతో అనుబంధం చాలా కొత్తగా ఉంది. అంటూ తన కొత్త ప్రేయసి గురించి రణబీర్ కపూర్ ఎంతో గొప్పగా చెప్పే ప్రయత్నం చేశాడు.

   లైఫ్ చాలా ఎంజాయ్‌బుల్‌గా ఉందన్న రణబీర్

  లైఫ్ చాలా ఎంజాయ్‌బుల్‌గా ఉందన్న రణబీర్

  మనం కొత్తగా ప్రేమలో పడినపుడు జీవితం చాలా ఎంజాయ్‌బుల్‌గా ఉంటుంది. మన లైఫ్‌లోకి ఒక కొత్త వ్యక్తి వచ్చినపుడు ఏదో తెలియని నూతనోత్సాహం వస్తుంది. ఓల్డ్ ట్రిక్స్ అన్నీ కొత్తగా అనిపిస్తాయి. మనకు మనం ఎంతో రొమాంటిక్‌గా, చార్మింగ్‌గా కనిపిస్తాము. అన్నింటికంటే, ముఖ్యంగా నా జీవితం ఇప్పుడు ఎంతో బ్యాలెన్సింగ్‌గా ఉందనిపిస్తోంది..... అని రణబీర్ తెలిపారు.

   అలియా కూడా ఒప్పేసుకున్నట్లే

  అలియా కూడా ఒప్పేసుకున్నట్లే

  ఆ మధ్య అలియా భట్ ఇండియా టుడే ఇంటర్వ్యూలో మీకు ఎవరిపై క్రష్ ఉందని అడిగిన ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా ‘రణబీర్ కపూర్' అంటూ సమాధానం చెప్పింది.

  ఇంతకు ముందు రణబీర్ ఎఫైర్లు

  ఇంతకు ముందు రణబీర్ ఎఫైర్లు

  రణబీర్ కపూర్ ఇంతకు ముందు దీపిక పదుకోన్, కత్రినా కైఫ్‌లతో లాంగ్ టైమ్ రిలేషన్‌షిప్ కొనసాగించిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరితో తెగదెంపులు అయ్యాక కొంతకాలం ఒంటరిగా ఉన్న రణబీర్ క్రమక్రమంగా అలియాకు దగ్గరయ్యారు. ‘బ్రహ్మాస్త్ర' చిత్రంలో కలిసి నటిస్తున్న సమయంలోనే వీరి రిలేషన్ బలపడినట్లు తెలుస్తోంది. అలియా కొందరు యంగ్ హీరోలతో డేటింగ్ చేసింది.

  English summary
  Ranbir Kapoor confirms he is dating Alia Bhatt. Talking to GQ in an interview, he said in reply to the question whether he is dating Alia? “It’s really new right now, and I don’t want to over speak. It needs time to breathe and it needs space. As an actor, as a person, Alia is – what’s the right word? – flowing right now. When I see her work, when I see her act, even in life, what she gives is something that I’m aspiring to for myself. It’s new for us, so let it cook a bit.”
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more