»   » మూడోసారి నగ్నంగా రణ్‌బీర్.. సంజూ పాత్రపై విపరీతమైన చర్చ!

మూడోసారి నగ్నంగా రణ్‌బీర్.. సంజూ పాత్రపై విపరీతమైన చర్చ!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Sanju Movie Trailer Response

    బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంజూ చిత్రం ట్రైలర్ యూట్యూబ్‌లో దుమారం రేపుతున్నది. ఈ ట్రైలర్‌‌లోని సన్నివేశాలు సినీ విమర్శకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఈ చిత్రంలోని సన్నివేశాలు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఆయుధాల కేసులో భాగంగా సంజయ్ దత్‌ను విచారించే క్రమంలో నగ్నంగా నిలబెట్టిన సీన్‌ ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతున్నది.

     పీకేలో న్యూడ్‌గా రణ్‌బీర్

    పీకేలో న్యూడ్‌గా రణ్‌బీర్

    గతంలో రాజ్ కుమార్ హిరాణి, విధూ వినోద్ చోప్రా చిత్రంలో కూడా అమీర్ ఖాన్‌నే కాకుండా, రణబీర్‌ కపూర్‌ను దాదాపు నగ్నంగా చూపించారు. కాకపోతే కాస్త అడ్డంగా టేప్ రికార్డును పెట్టారు. పీకే చిత్రంలో చివరి సీన్‌లో గ్రహాంతరవాసిగా భూమికి వచ్చిన రణ్‌బీర్ దాదాపు బట్టలు లేకుండా దాదాపు నగ్నంగా కనిపిస్తాడు.

    సంజయ్ దత్‌ పాత్రలో నగ్నంగా

    సంజయ్ దత్‌ పాత్రలో నగ్నంగా

    సంజూ చిత్రంలోనూ సంజయ్ దత్ పాత్రను పోషించిన రణ్‌బీర్‌ను రాజు హిరాణి బట్టలు విప్పించాడు. నగ్నంగా చూపిస్తే సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుందని ఓ స్టీల్ జగ్గును అడ్డంగా పెట్టారు.

    మొదటి చిత్రం సావరియాలో కూడా

    మొదటి చిత్రం సావరియాలో కూడా

    రణ్‌బీర్ కపూర్ విషయానికి వస్తే, ఇలా నగ్నంగా కనిపించడం ఇది మూడోసారి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన సావరియా చిత్రంలో కూడా రణ్‌బీర్ ఓ పాటలో ఒంటికి చుట్టుకొన్న టవల్‌ను విప్పేయడం జరిగింది. అప్పట్లో ఆ విషయం మీడియాలో చర్చనీయాంశమైంది.

    ఎమోషన్స్ కోసం తప్పడం లేదు

    ఎమోషన్స్ కోసం తప్పడం లేదు

    సంజూ ట్రైలర్ రిలీజ్ తర్వాత రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. నా మొదటి చిత్రంలోనే నగ్నంగా కనిపించాను. ఆ సినిమాలో టవల్ జారిపోతుంది. నిజజీవితంలో చాలా సిగ్గుగా ఉంటుంది. కెమెరా ముందు ఎమోషన్స్ పండించడం కోసం నగ్నంగా మారాల్సి వస్తుంది అని అన్నారు.

     జూన్ 29న రిలీజ్

    జూన్ 29న రిలీజ్

    పీకే, 3 ఇడియెట్స్, లగే రహో మున్నాభాయ్, మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రాలను రూపొందించిన నిర్మాత విధూ వినోద్ చోప్రా, డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి సంజూ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్నది.

    English summary
    Finally, The wait is over and the much anticipated Sanju trailer is out. The makers of Sanju unveiled its trailer on Wednesday in the presence of the film's cast and crew. The trailer of the Sanjay Dutt biopic that stars Ranbir Kapoor as the protagonist, has not just met with the expectations of the fans, but surpassed them at several levels. We just have one word for the Sanju trailer and that is Mind Blowing.
    దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more