Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
మూడోసారి నగ్నంగా రణ్‌బీర్.. సంజూ పాత్రపై విపరీతమైన చర్చ!
Recommended Video
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంజూ చిత్రం ట్రైలర్ యూట్యూబ్‌లో దుమారం రేపుతున్నది. ఈ ట్రైలర్‌లోని సన్నివేశాలు సినీ విమర్శకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఈ చిత్రంలోని సన్నివేశాలు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఆయుధాల కేసులో భాగంగా సంజయ్ దత్‌ను విచారించే క్రమంలో నగ్నంగా నిలబెట్టిన సీన్ ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతున్నది.
పీకేలో న్యూడ్‌గా రణ్‌బీర్
గతంలో రాజ్ కుమార్ హిరాణి, విధూ వినోద్ చోప్రా చిత్రంలో కూడా అమీర్ ఖాన్నే కాకుండా, రణబీర్ కపూర్‌ను దాదాపు నగ్నంగా చూపించారు. కాకపోతే కాస్త అడ్డంగా టేప్ రికార్డును పెట్టారు. పీకే చిత్రంలో చివరి సీన్లో గ్రహాంతరవాసిగా భూమికి వచ్చిన రణ్‌బీర్ దాదాపు బట్టలు లేకుండా దాదాపు నగ్నంగా కనిపిస్తాడు.
సంజయ్ దత్ పాత్రలో నగ్నంగా
సంజూ చిత్రంలోనూ సంజయ్ దత్ పాత్రను పోషించిన రణ్‌బీర్‌ను రాజు హిరాణి బట్టలు విప్పించాడు. నగ్నంగా చూపిస్తే సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుందని ఓ స్టీల్ జగ్గును అడ్డంగా పెట్టారు.
మొదటి చిత్రం సావరియాలో కూడా
రణ్‌బీర్ కపూర్ విషయానికి వస్తే, ఇలా నగ్నంగా కనిపించడం ఇది మూడోసారి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన సావరియా చిత్రంలో కూడా రణ్‌బీర్ ఓ పాటలో ఒంటికి చుట్టుకొన్న టవల్‌ను విప్పేయడం జరిగింది. అప్పట్లో ఆ విషయం మీడియాలో చర్చనీయాంశమైంది.
ఎమోషన్స్ కోసం తప్పడం లేదు
సంజూ ట్రైలర్ రిలీజ్ తర్వాత రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. నా మొదటి చిత్రంలోనే నగ్నంగా కనిపించాను. ఆ సినిమాలో టవల్ జారిపోతుంది. నిజజీవితంలో చాలా సిగ్గుగా ఉంటుంది. కెమెరా ముందు ఎమోషన్స్ పండించడం కోసం నగ్నంగా మారాల్సి వస్తుంది అని అన్నారు.
జూన్ 29న రిలీజ్
పీకే, 3 ఇడియెట్స్, లగే రహో మున్నాభాయ్, మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రాలను రూపొందించిన నిర్మాత విధూ వినోద్ చోప్రా, డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి సంజూ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్నది.