Don't Miss!
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- News
girl: కాలేజ్ అమ్మాయి మీద జరదా బీడా ఉమ్మేశాడు. అమ్మాయి ముఖం మీద కత్తితో ?
- Sports
IND vs NZ: హార్దిక్ పాండ్యా.. ఇంత స్వార్థమా? నీ దోస్తుల కోసం పృథ్వీ షాను పక్కనబెడతావా? ఫ్యాన్స్ ఫైర్
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
నా గడ్డమే ముంచేసింది.. దాని వల్ల దాదాపు 150 కోట్లు పోయాయి: రణ్బీర్
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో కొంతమంది హీరోలు వరుస అపజయాలతో సతమతమవుతున్నారు. ఒకప్పటి స్టార్ హీరోలు కూడా ఇప్పుడు దారుణమైన డిజాస్టర్స్ ఎదుర్కొంటున్నారు. అయితే రణ్బీర్ కపూర్ రీసెంట్ గా బ్రహ్మస్త్ర సినిమాతో పరవాలేదు అనిపించినప్పటికీ అంతకు ముందు వచ్చిన ఒక సినిమాతో మాత్రం దారుణంగా డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడానికి కేవలం తన గడ్డమే అని కూడా అతను చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే
బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణబీర్ కపూర్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తన పాత్ర డిఫరెంట్ గా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఇక బ్రహ్మాస్త్ర 1 సినిమాతో మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో మరో సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా కంటే ముందు అతను షంషేరా సినిమాతో వచ్చాడు. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది.

అయితే ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు అయితే దారుణంగా నష్టపోయారు. దాదాపు 150 కోట్ల వరకు ఈ సినిమా నష్టాలు చూడాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణాన్ని కూడా ఇటీవల రణ్ బీర్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అతను మాట్లాడుతూ షంషేరా సినిమా డిజాస్టర్ కావడానికి ఒక ప్రధాన కారణం కూడా ఉంది అందులో ముఖ్యంగా నా గడ్డం అయితే అసలు ఏమాత్రం సెట్ అవ్వలేదని అన్నాడు.

అది నేచురల్ గా పెంచి ఉంటే మరోలా ఉండేదేమో.. కానీ కృత్రిమంగా గడ్డం పెట్టుకోవడం వలన ఎండలో షూటింగ్ చేసినప్పుడు సరిగ్గా కనిపించలేదు. అంతేకాకుండా ముఖానికి ఏదో అంటుకున్నట్లు కనిపించింది. ఒక విధంగా ఆడియెన్స్ ఆ విషయంలో అసంతృప్తి చెందారు అని నాకు తెలిసింది. అందుకే ఈ సినిమాకు ఫ్లాప్ అవ్వడానికి అదొక ప్రధాన కారణం అయ్యి ఉండవచ్చు. కొన్నిసార్లు చిన్న చిన్న కారణాలే సినిమా పై మొత్తం ఫీలింగ్ ను మార్చేస్తాయి.. అని రణ్బీర్ కపూర్ తెలియజేశాడు.