»   » ఇంకా ఎంత మందితో సరసాలు.. ఈ సారి ఏకంగా పాకిస్తాన్ పిల్లతో!

ఇంకా ఎంత మందితో సరసాలు.. ఈ సారి ఏకంగా పాకిస్తాన్ పిల్లతో!

Subscribe to Filmibeat Telugu
Ranbir Kapoor Starts New Affair With Pakistani Model

గత ఏడాది కాలంగా బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణబీర్ కపూర్, పాకిస్థానీ బ్యూటీ మహీరా ఖాన్ మధ్య ఏదో జరుగుతోందంటూ బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రణబీర్ కపూర్ బాలీవుడ్ హీరోయిన్లకు కలల రాకుమారుడు. కొంత మంది హీరోయిన్లతో రణబీర్ నడిపిన ప్రేమాయణం వార్తల్లోకి ఎక్కింది. పెళ్లి వరకు చేరుకుంటుందనుకున్న ప్రేమ కాస్త ఈ హీరో విషయంలో బెడిసి కొట్టింది. ప్రేమ వ్యవహారం నడిపిన అందరి హీరోయిన్ల తో ఈ హీరోకి బ్రేక్ అప్ అయిపోయింది.

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణబీర్ కపూర్ తన సినిమాల కంటే కూడా హీరోయిన్లతో ఎఫైర్ల వలన ఎక్కువగా వార్తలో నిలిచాడు. గతంలో రణబీర్ సాగించిన ప్రేమాయణాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

ఆ ఇద్దరితో బ్రేక్ అప్

ఆ ఇద్దరితో బ్రేక్ అప్

రణబీర్ కపూర్ గతంలో బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ తో ఘాటు ప్రేమాయణం సాగించాడు. కత్రినా కైఫ్ తో అయితే క్లోజ్ గా ఉన్న ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీకై హల్ చల్ చేశాయి. కాగా రణబీర్ ఇద్దరితో బ్రేక్ అప్ చేసుకున్నాడు.

ఏడాది కాలంగా

ఏడాది కాలంగా

కత్రినా కైఫ్ తో బ్రేక్ అప్ అయ్యాక రణబీర్ కపూర్ సింగిల్ గా ఉన్నాడు. కానీ గత ఏడాది నుంచి మరో ఎఫైర్ మొదలు పెట్టాడని వార్తలు వస్తున్నాయి.

సిగరెట్ బ్యూటీతో ఎఫైర్

సిగరెట్ బ్యూటీతో ఎఫైర్

రణబీర్ కపూర్, పాకిస్తానీ అందం మహీరా ఖాన్ మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. గత ఏడాది వీరిద్దరూ సిగరెట్ కొడుతూ కెమెరా కంటికి చిక్కిన సంగతి తెలిసిందే. అప్పట్లో సోషల్ మీడియాలో మహీరా పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురైంది.

లండన్ లో రహస్యంగా

లండన్ లో రహస్యంగా

తాజాగా రణబీర్ కపూర్, మహీరా లండన్ లో రహస్యంగా కలుసుకున్నారని వార్తలు వస్తున్నాయి. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం రణబీర్ లండన్ లో ఉన్నాడు. మహీరా కూడా లండన్ లోనే ఉంటోంది. రణబీర్ మరియు మహీరా రహస్యంగా కలుసుకుని ఒంటరిగా గడిపినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రేమలో లేను

ప్రేమలో లేను

గతంలో ప్రేమ వార్తలపై మీడియా మహీరాని ప్రశ్నించింది. రణబీర్ విషయాన్ని దాటవేసిన మహీరా తాను ఎవ్వరితోనూ ప్రేమలో లేనని తెలిపింది. ఇదిలా ఉండగా రణబీర్ కపూర్ త్వరలో నిర్ణయించిన వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా రణబీర్ కపూర్ ప్రేమ వ్యవహారాల గురించి వార్తలు మాత్రం ఆగడం లేదు.

English summary
Ranbir Kapoor and Mahira Khan secretly meet in London. Ranbir Kapoor in relation with Mahira.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X