భావోద్వేగంగా రిషి కపూర్‌‌కు ప్రత్యేక పూజలు... కంటతడి పెట్టిన రణ్‌బీర్, నీతూ సింగ్

లక్షలాది అభిమానులను కన్నీటి సాగరంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిన అలానటి రొమాంటిక్ హీరో రిషి కపూర్ మరణ విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలిగించేలా శనివారం కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో అందరూ భావోద్వేగంలో మునిగిపోయారు. రిషి ఫోటోకు దండలు వేసి భార్య నీతూ సింగ్, కుమారుడు రణ్‌బీర్ కపూర్ ఉన్న ఫోటో అభిమానులను మరింత ఎమోషనల్‌గా మార్చింది. ఈ ప్రార్థన కార్యక్రమంలో ఏం జరిగిందంటే..

Recommended Video

Ranbir Kapoor Gets Emotional At Rishi Kapoor Prayers Meet
రిషి కపూర్ కోసం శాంతిపూజలు

రిషి కపూర్ కోసం శాంతిపూజలు

రిషి కపూర్‌కు శ్రద్దాంజలి ఘటించే ప్రార్థనా కార్యక్రమం శనివారం ముంబైలో కుటుంబ సభ్యుల కన్నీటితో కూడిన బాధల మధ్య జరిగింది. రణ్‌బీర్ కాషాయపు రంగు తలపాగా చుట్టుకొని.. నుదుట ఎర్రటి తిలకం దిద్దుకొని భావోద్వేగంగా కనిపించారు. భార్య నీతూ సింగ్ తెల్లటి కుర్తా, దుపట్టాలో ముఖం పాలిపోయి ఇంకా దు:ఖం నుంచి కోలుకోని ఛాయలు కనిపించారు.

ముంబై చేరుకొన్న రిషి కూతురు

తండ్రి రిషి కపూర్‌ను చివరి చూపుకు కూడా నోచుకొని కూతురు రిద్దిమా కపూర్ శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి ముంబై చేరుకొన్నారు. రిద్దిమా ఇంటికి చేరుకోగానే రిషి నివాసమంతా గంభీరంగా మారిపోయింది. ఒక్కసారిగా రోదనలతో కుటుంబ సభ్యులు రిషి లేరనే బాధను పంచుకొన్నారు. నీతూ, రిషి ఈ సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యారని తెలిసింది.

 అంత్యక్రియలకు హాజరుకానీ రిషి కూతురు

అంత్యక్రియలకు హాజరుకానీ రిషి కూతురు

లాక్‌డౌన్ కారణంగా రిషి కపూర్ అంత్యక్రియలకు రిద్దికపూర్ చేరుకోలేకపోయారు. ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో ఏప్రిల్ 30న రిషి మరణించిన సమయంలో రిద్ది ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ పోలీసుల అనుమతితో ఆమె శుక్రవారం ఢిల్లీ నుంచి బయలు దేరి దాదాపు 18 గంటల తర్వాత ముంబై చేరుకొన్నారు. అనంతరం తండ్రి కోసం నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమం

ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమం

రిషి కపూర్ మరణం నేపథ్యంలో ఆదివారం కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొంటారని తెలిసింది. ఏప్రిల్ 30న జరిగిన అంత్యక్రియల్లో కరీనా, సైఫ్, అభిషేక్, ఆలియాభట్, ఆర్మాన్ జోషి, ఆదార్ జైన్, రిమా జైన్, మనోజ్ జైన్, రణధీర్ కపూర్, రాజీవ్ కపూర్, కునాల్ కపూర్, అనిల్ అంబానీ తదితరులు పాల్గొన్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X