రణ్‌బీర్ కపూర్‌కు మరో విషాదం.. తండ్రి మరణం తర్వాత మరో షాక్

మనిషిని పోలిన మనిషి ఉండటం అరుదుగా ఉంటుంది. అచ్చు గుద్దినట్టు ఉండే వాళ్లు మరీ అరుదుగా కనిపిస్తారు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ను పోలిన యువకుడు జునైద్‌ను ఆయన పక్కన నిలుచో బెడితే కంగారు పడటం సహజం. అసలు రణ్‌బీర్ ఎవరనది గుర్తు పట్టడం కష్టంగా అనిపిస్తుంది. అలాంటి జునైద్ ఆకస్మిక మరణం చెందడంతో బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్ కపూర్‌ విషాదంలో మునిగిపోయారు. తండ్రి రిషికపూర్ మరణం తర్వాత ఆయనను మరో విషాదం వెంటాడింది. అచ్చు తనలా ఉండే డూప్ జునైద్ షా గుండెపోటుతో మరణించడంతో విషాదంతో సంతాపం ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..

28 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు

28 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు

కశ్మీర్‌ ప్రాంతానికి చెందిన జునైద్ శుక్రవారం రోజు శ్రీనగర్‌లోని ఇలాహీ భాగ్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 28 సంవత్సరాలు. చిన్న వయసులోనే జునైద్ తిరిగి రాని లోకాలకు వెళ్లడం బాలీవుడ్ వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఎంతో భవిష్యత్ ఉన్నందనుకొంటున్న సమయంలో జునైద్‌కు తీరని అన్యాయం చేశాడనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

 జూనైద్‌ను చూసి రిషి కపూర్ షాక్

జూనైద్‌ను చూసి రిషి కపూర్ షాక్

రణ్‌బీర్ కపూర్‌కు అచ్చు గుద్దినట్టుగా ఉండే జూనైద్ చూసి దివంగత రిషీకపూర్ ఆశ్చర్యానికి గురై ట్వీట్ చేయడంతో ఆయన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో వచ్చిన జూనైద్ ఫోటో చూసి రిషి కపూర్ ట్వీట్ చేస్తూ.. నా కుమారుడికి నిజమైన డూప్. ఓ మైగాడ్. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. డూప్ అంటే ఇది. మనిషిని పోలిన మనిషి ఇది అంటూ పేర్కొన్నారు. రిషికపూర్ ఫొటోను షేర్ చేసిన తర్వాత జూనైద్ సెలబ్రిటీగా మారిపోయారు.

రణ్‌బీర్‌కు పలు ప్రాజెక్టుల్లో సహాయం

రణ్‌బీర్‌కు పలు ప్రాజెక్టుల్లో సహాయం

ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్‌కు దగ్గరైన జూనైద్ పలు ప్రాజెక్టుల్లో సహాయం చేశాడు. ముంబైలో పలు మోడలింగ్ అసైన్‌మెంట్స్‌లో రణ్‌బీర్‌ కపూర్‌కు సహయపడ్డారు. ఆ తర్వాత తన తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో శ్రీనగర్‌కు మకాం మార్చారు. తండ్రి ఆరోగ్య సంరక్షణలో ఉండగానే జూనైద్ మరణించడం నెటిజన్లందర్నీ షాక్ గురి చేస్తున్నది.

Recommended Video

Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
సోషల్ మీడియాలో సంతాపాల వెల్లువ

సోషల్ మీడియాలో సంతాపాల వెల్లువ

రణ్‌బీర్ కపూర్ డూప్ జూనైద్ మరణంపై పలువురు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్‌లోని సీనియర్ జర్నలిస్ట్ ట్వీట్ చేస్తూ.. మా పొరుగింటి అబ్బాయి, నిస్సార్ కుమారుడు జూనైద్ గుండెపోటుతో మరణించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి జూనైద్ కొండంత అండగా నిలిచాడు. తండ్రి కోసం కెరీర్‌ను వదిలేసుకొన్నాడు. అలాంటి వ్యక్తి మరణించడం చాలా బాధగా ఉంది అని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X