twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్విటర్ రివ్యూ: సంజు.. చరిత్రలో నిలిచేలా రణబీర్, రాజ్ కుమార్ హిరానికి సెల్యూట్!

    |

    Recommended Video

    Sanju Movie Twitter Review సంజు ట్విటర్ రివ్యూ

    సంజయ్ దత్ బయోపిక్ గా తెరకెక్కిన సంజు చిత్రం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. సంజు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే సమయం రానే వచ్చింది. బాలీవుడ్ స్టార్ గా ఎదిగిన సంజయ్ దత్ జీవితంలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. సంజయ్ జీవితం మొత్తం వివాదాలతోనే సాగింది. ఈ వివాదాలకు కారణం ఏంటి, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సంజయ్ జీవితాన్ని ఎలా ఆవిష్కరించారు ? లవర్ బాయ్ లా కనిపించే రణబీర్.. సంజయ్ దత్ పాత్రలో ఎలా నటించాడు అనే అంశాలు ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అందువలనే కనీవినీఎరుగని విధంగా సంజు చిత్రానికి క్రేజ్ నెలకొంది. ఆ సమయం రానే వచ్చింది. నేడు ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉందొ చూద్దాం!

    రాజ్ కుమార్ హిరానికి సెల్యూట్

    ఈ చిత్ర ప్రీమియర్ షో చూసాక ప్రముఖ బాలీవుడ్ నటుడు జావేద్ జాఫ్రీ సొసైల్ మీడియా వేదికగా స్పందించారు. ఇప్పుడే సంజు చూసా. అద్భుతమైన చిత్రం. రణబీర్ కపూర్ నటన చాలా బావుంది. రాజ్ కుమార్ హిరానికి సెల్యూట్.

    దంగల్ ని ఛాలెంజ్ చేసే చిత్రం

    రణబీర్ కపూర్ చాలా కాలం తరువాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సంజు చిత్రం దంగల్ రికార్డ్స్ ని ఛాలెంజ్ చేసే విధంగా ఉంది.

    సంజయ్ దత్ కోసమే

    సంజు చిత్రం విడుదలవుతుండటంతో చాలా ఉత్కంఠగా ఉంది. అధికశాతం సంజయ్ దత్ కోసమే వెళుతున్నాం.

    ఎలాంటి పండుగలు లేవు

    సంజు చిత్రం ఎలాంటి పండుగలు లేని సమయంలో విడుదలవుతోంది. అయినా కూడా అమిర్ ఖాన్ పీకేని మించే వసూళ్లు రాబట్టడం ఖాయం.

    బాహుబలి2 తరువాత

    సంజు చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంటే ఓపెనింగ్స్ పరంగా బాహుబలి 2 తరువాత స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.

    కళ్లుచెదిరే బుకింగ్స్

    జాతీయ వ్యాప్తంగా సంజు చిత్రం భారీ స్థాయిలో విడుదలవుతోంది. మల్టిప్లెక్స్ లలో 65 శాతం బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది.

    నిజమైన సంజయ్ దత్

    సంజు చిత్రంలో రణబీర్ కపూర్ నిజంగా సంజయ్ దత్ లా కనిపిస్తాడు.

    ఎమోషనల్ గా

    సంజు చిత్రంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యా.

    హౌస్ ఫుల్ ఓపెనింగ్స్

    సంజు చిత్రానికి హౌస్ ఫుల్ ఓపెనింగ్స్ దక్కుతున్నాయి.

    బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్

    సంజు చిత్రం రణబీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది.

    English summary
    Ranbir Kapoor's Sanju movie twitter review. Raj Kumar Hirani ready to do his magic again
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X