twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రణబీర్ కపూర్ 'సంజు' చిత్రంపై కేసు.. సినిమా ఆగిపోయే ప్రమాదం, అంత నీచంగా చూపిస్తారా!

    |

    ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన సంజయ్ దత్ బయోపిక్ చిత్రం సంజు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంజయ్ దత్ వివాదసంపద జీవితాన్ని ఆసక్తికరమైన కథగా మలచిన రాజ్ కుమార్ హిరానీ.. వెండి తెరపై అంతే ఆసక్తికరంగా చూపించబోతున్నాడు. పూర్తి గా సంజయ్ దత్ గా మారిపోయిన రణబీర్ కపూర్ మేకోవర్ అద్భుతంగా ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో రాజ్ కుమార్ హిరానీ టేకింగ్, రాజబీర్ కపూర్ నటన అవాక్కయ్యేలా చేసింది. రణబీర్ కపూర్ తన పాత్రలో జీవించేశాడు. తాజగా ఈ చిత్ర విడుదలకు ఆటంకాలు మొదలయ్యాయి. సరికొత్త వివాదం లో సంజయ్ దత్ బయోపిక్ చిత్రం ఇరుక్కుంది.

    సంచలనం సృష్టించిన ట్రైలర్

    సంచలనం సృష్టించిన ట్రైలర్

    సంజయ్ దత్ జీవితంలో అన్ని వివాదాలని ఈ చిత్రంలో రాజ్ కుమార్ హిరానీ చూపించబోతున్నారు. మూడు నిమిషాల ట్రైలర్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. పలు కేసుల్లో సంజయ్ దత్ జైలు జీవితం అనుభవించిన దృశ్యాలు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి.

    టాయిలెట్ లీకేజి సీన్

    టాయిలెట్ లీకేజి సీన్

    మరి కొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న సమయంలో 'సంజు' చిత్రం వివాదంలో చిక్కుకుంది. ట్రైలర్ లో చూపిన టాయిలెట్ లీకేజి సీన్ పై ప్రజా కార్యకర్త ప్రిథ్వి కేసు నమోదు చేశారు. ఆ సన్నివేశం అభ్యంతరంగా ఉందని ఆయన వాదిస్తున్నారు.

    జైలులో ఖైదీగా

    జైలులో ఖైదీగా

    సంజయ్ దత్ చాలా కాలం జైలు జీవితం అనుభవించారు. రణబీర్ కపూర్ జైలు జైలు ఉండగా టాయిలెట్ లీకై ఆ వ్యర్థం అంత పాకుతూ ఉండే దృశ్యాల్ని దర్శకుడు రక్తి కట్టించే విధంగా చూపించాడు.

    భారతీయ జైళ్లపై చెడు అభిప్రాయం

    భారతీయ జైళ్లపై చెడు అభిప్రాయం

    ఇలాంటి సన్నివేశాలు చూపించడం వలన భారతీయ జైళ్లపై చెడు అభిప్రాయం నెలకొంటుందని ప్రజా కార్యకర్త పృథ్వి వాదిస్తున్నారు. జైళ్ల గురించి ఇలాంటి కంప్లైంట్ తానెప్పుడూ వినలేదని అంటున్నారు.

    చిత్రంపై ఫిర్యాదు

    చిత్రంపై ఫిర్యాదు

    ఈ నేపథ్యంలో పృథ్వి సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ కు ఫిర్యాదు చేసారు. ఆ సన్నివేశాన్ని చిత్రం నుంచి తొలగించాలని కోరారు. భారత అధికారుల నుంచి తాను పొందిన సమాచారం ప్రకారం ఏ జైలు లోనూ ఇలాంటి ఘటనలు జరగలేదు. జైలు నిర్వహణలో వారు శ్రద్ద తీసుకుంటున్నారు అని పృథ్వి తన లేఖలో పేర్కొన్నారు.

    విడుదల ఆపేస్తా

    విడుదల ఆపేస్తా

    గతంలో కూడా చాలా మంది జైలు సన్నివేశాలు చిత్రికరించారు. కానీ ఇంత నీచంగా ఎవరూ చూపించలేదు. మీరు చిత్ర యూనిట్ పై చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళ్లి అయినా సినిమా విడుదల ఆపేస్తా అని పృథ్వి తనలేఖలో పేర్కొనడం గమనార్హం.

    English summary
    Ranbir Kapoor's Sanju in trouble. complaint filed with CBFC for toilet scene
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X