Ranbir Kapoor's Wedding gift ఆలియా భట్ ధరించిన ఉంగరం, మంగళసూత్రం ధర ఎంతో తెలుసా?

బాలీవుడ్ అగ్ర తారలు ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ వివాహం నిరాడంరంగా, అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, అతిథుల మధ్య వైభవంగా జరిగింది. మీడియా హంగామాకు దూరంగా జరిగిన ఈ వివాహంలో కొద్ది మంది తారలు మెరిశారు. ఏప్రిల్ 14వ తేదీన వివాహం జరిగిన వెంటనే ముంబైలోని పాలి హిల్స్‌లోని రణ్‌బీర్ కపూర్ నివాసంలో నవ దంపతులు ఫోటోలకు ఫోజిచ్చారు. ఈ సందర్భంగా ఆలియా ధరించిన దుస్తులు, ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ వివరాల్లోకి వెళితే..

బ్రహ్మస్త్ర షూటింగులో

బ్రహ్మస్త్ర షూటింగులో


ఆలియా భట్, రణ్‌బీర్ అఫైర్ విషయానికి వస్తే.. ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహర్ రూపొందించిన బ్రహ్మస్త్ర చిత్ర షూటింగులో ఇద్దరి మనసులు కలుసుకొన్నాయి. బ్రహ్మస్త్ర షూటింగులో మొదలైన ప్రేమ వ్యవహారం ఐదేళ్లపాటు కొనసాగింది. ముందుగానే ఈ వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకొన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

పెళ్లికి హాజరైన వారు వీళ్లే

పెళ్లికి హాజరైన వారు వీళ్లే

ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లికి కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్, కుటుంబ సభ్యలు రిద్దిమా కపూర్, సహ్నీ, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, మహేష్ భట్, సోని రజ్దాన్, షహీన్ భట్, లవ్ రంజన్, కరణ్ జోహర్, ఆయాన్ ముఖర్జీ, సైఫ్ ఆలీఖాన్ తదితరులు హాజరయ్యారు.

కేక్ కట్ చేసి రొమాంటిక్‌గా

కేక్ కట్ చేసి రొమాంటిక్‌గా

గత ఐదేళ్ల రిలేషన్‌షిప్‌కు కొత్త ఆరంభం మొదలైంది అంటూ పెళ్లి జరగానే భారీ కేక్‌ను రణ్‌బీర్, ఆలియాభట్ కట్ చేశారు. అనంతరం ఒకరికొకరు కేక్ తినిపించుకొంటూ రొమాంటిక్‌గా కనిపించారు. అనంతరం లిప్‌లాక్ చేస్తూ ఫోటోలకు ఫోజిచ్చారు. పెళ్లి తర్వాత ఆలియాభట్ ముఖం కాంతులతో వెలిగిపోయింది. రణ్‌బీర్ కపూర్ ఆనందంలో మునిగి తేలుతూ కనిపించాడు.

పెళ్లి కూతురుగా ఆలియా భట్

పెళ్లి కూతురుగా ఆలియా భట్


ఇక ఆలియాభట్ పెళ్లి కూతురుగా అందర్ని ఆకర్షించారు. ఆమె ధరించిన దుస్తులు, ఆభరణాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆలియా ధరించిన జ్యువెల్లరీ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఖరీదైన, విలువైన మంగళసూత్రం అందర్నీ ఆకర్షించింది. వజ్రాలతో పొదిగిన మంగళసూత్రం ఆలియా మెడలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

రణ్‌బీర్ కపూర్ రేర్ గిఫ్ట్

రణ్‌బీర్ కపూర్ రేర్ గిఫ్ట్

ఇక ఆలియా భట్ చేతికి ధరించి మ్యారేజ్ రింగ్ మరో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆలియా ధరించిన భారీ మ్యారేజ్ డైమండ్ రింగ్, మంగళసూత్రం రణ్‌బీర్ ప్రేమతో బహుకరించినట్టు సన్నిహితులు వెలలించారు. దాదాపు కోటి రూపాయల వరకు విలువ ఉంటుందని మీడియా అభిప్రాయపడుతున్నది.

Recommended Video

KGF Chapter 2 Inayath Khaleel ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ తండ్రే| Filmibeat Telugu
ఏప్రిల్ 17న భారీగా రిసెప్షన్

ఏప్రిల్ 17న భారీగా రిసెప్షన్


ఇదిలా ఉండగా, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఇద్దరు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు భారీ విందును ఏర్పాటు చేశారు. ముంబైలోని తాజ్‌లో జరిగే రిసెప్షన్‌కు ప్రముఖులంతా తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖులు జాబితాలో దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్, కత్రినా కైఫ్, వికీ కౌశల్, అంబానీ ఫ్యామిలీ, మహారాష్ట్ర రాజకీయ నేతలు ఉన్నట్టు సమాచారం. ఈ రిసెప్షన్ ఏప్రిల్ 17న ముంబైలో జరుగనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X