అలియా భట్ ఖరీదైన డ్రెస్సును కాలితో తన్నిన రణ్‌బీర్ కపూర్.. అంత పొగరు ఎందుకో?
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొంత కాలంగా కొన్ని ప్రేమ జంటలు పేర్లు బాగానే వైరల్ అవుతున్నాయి. వీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ప్రతిరోజు మీడియా లో ఏదో ఒక కొత్త కథనం వైరల్ అవుతూనే ఉంది. ఇక అలా మాంచి హైప్ క్రియేట్ చేసుకున్న జంటలలో టాప్ లిస్టులో అలియా భట్ రణ్‌బీర్ కపూర్ ఉన్నారు అని చెప్పవచ్చు. ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు గత ఏడాది నుంచి అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే రూమర్స్ డోస్ ఎంత పెరుగుతున్నా కూడా ఇంతవరకు ఈ స్టార్ కపుల్స్ ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే ఇటీవల రణ్‌బీర్ కపూర్ తన ప్రియురాలి విషయంలో కాస్త అసభ్యంగా వ్యవహరించాడు అని టాక్ వస్తోంది.

ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా..
అలియా భట్, రణ్‌బీర్ పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ కొందరు సెలబ్రిటీలు కూడా ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. ఇక ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా అలియా భట్ చిరునవ్వుతో స్పందించింది. కానీ రణ్ బీర్ అయితే ఆ విషయాన్ని ప్రస్తావించకుండా తప్పించుకుంటున్నారు. ఇక సినిమాల విషయంలో మాత్రం ఈ ఇద్దరు స్టార్స్ పోటాపోటీగా ముందుకు కొనసాగుతున్నారు.

పెళ్లికి సిద్ధమైన జంట
రణ్‌బీర్ కపూర్ అలియా భట్ ఇప్పటికే చాలా సందర్భాల్లో కలిసి కనిపించారు. రెగ్యులర్ గా పార్టీలకు వెళ్లడమే కాకుండా ఫెస్టివల్స్ లో కూడా ఈ జంట స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపిస్తుంది. రణ్‌బీర్ తన ఇంట్లో వేడుకలకు కూడా అలియా భట్ ను తీసుకు వెళుతూ ఉంటాడు.
అలియా కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తానని కూడా చాలా సందర్భాల్లో క్లారిటీ ఇచ్చాడు. ఇక వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత ఏడాది నుంచి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ కూడా ఇవ్వరు ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

కాలితో తన్నిన హీరో
అయితే ఇటీవల దీపావళి సందర్భంగా రణ్ బీర్ కపూర్ అలియా భట్ కలిసి సెలబ్రిట్ చేసుకున్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ఒక వీడియోలో రణ్ బీర్ కపూర్ చాలా పొగరు ప్రవర్తించినట్లు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అలియా భట్ ఖరీదైన లెహంగా ధరించి మెట్లు దిగుతూ ఉండగా ఆమె డ్రెస్ మెట్ల దగ్గర ఉన్న పూలను తాకుకుంటూ వెళ్లింది. ఇక ఆ సమయంలో రణ్ బీర్ ఆమె లెహంగాను కాలితో తన్నాడు.
Recommended Video

కోపంలో రణ్ బీర్?
రణ్ బీర్ కపూర్ పూలు చెదిరిపోకుండా ఉండేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అలా తన్నకుండా చేయితో కూడా తీయాల్సింది అంటూ నెటిజన్లు అంటున్నారు. అయితే ఆ ఈవెంట్ లో అలియా భట్ సరదాగా ఉన్నప్పటికీ రణ్ బీర్ మాత్రం చాలా కోపంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. పక్కన అలియాతో ఫొటోలు దిగుతుండగా చాలా సీరియస్ గా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇక వీరి పెళ్లి వేడుక మళ్ళీ వాయిదా పడినట్లు కొత్త తరహా రూమర్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











