Rashmika Mandanna: రెండు ఇంటర్వెల్స్‌తో యానిమల్.. ఏంటి అన్ని గంటలు ఉంటుందా?

ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలలోనూ బహు భాషా సినిమాలు తెరకెక్కుతోన్నాయి. అందులో తెలుగు దర్శకులు చేసే సినిమాలే ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటి వాటిలో 'యానిమల్' ఒకటి. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేషన్ అయిన సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ మూవీనే 'యానిమల్'. క్రేజీ కాంబోలో ఫుల్ వైల్డుగా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తవగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటున్నారు.

Ranbir Kapoor Starrer Animal Movie Have Lengthy Run Time and Two Intervals

క్రేజీ కాంబినేషన్‌లో హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'యానిమల్' చిత్రాన్ని ఆగస్టు 11వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని అనుకున్నారు. అనివార్య కారణాలతో అప్పుడు విడుదల చేయలేదు. ఇక, ఈ సినిమాను డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

ఎంతో మంది స్టార్లు కలిసి నటిస్తోన్న 'యానిమల్' మూవీ రన్ టైం గురించి ఇటీవలే ఓ న్యూస్ లీకైన విషయం తెలిసిందే. ఈ సినిమా ఏకంగా మూడు గంటలకు పైగా నిడివితో రాబోతుందని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ఫైనల్‌గా 3 గంటల 12 నిమిషాల నిడివితో రాబోతుందని తెలిసింది. అయితే, ఎక్కడా బోర్ కొట్టకుండా స్పీడ్‌గా రన్ అవుతుందని టాక్.

Ranbir Kapoor Starrer Animal Movie Have Lengthy Run Time and Two Intervals

'యానిమల్' మూవీ గురించి మరో సెన్సేషనల్ న్యూస్ కూడా ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమాలో రెండు ఇంటర్వెల్స్ ఉండేలా ప్లాన్ చేశారట. దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం ఇలాంటి సినిమాలు వచ్చేవి. ఇప్పుడు మళ్లీ సందీప్ రెడ్డి వంగా తన చిత్రంతో పాత ట్రెండ్‌ను మరోసారి పరిచయం చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కాంబోలో రాబోతున్న 'యానిమల్' మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మిస్తున్నారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా తదితరులు సంగీతాన్ని అందించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ వంటి వాళ్లు కీలక పాత్రలను పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X