HBD Ranbir Kapoor: సర్‌ప్రైజింగ్‌గా యానిమల్ టీజర్.. రెండు బూతులు, హై రేంజ్ యాక్షన్‌తో!

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినా.. తక్కువ సమయంలోనే దేశ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలను సొంతం చేసుకున్న దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా ఒకడు. తెలుగులో 'అర్జున్ రెడ్డి' చిత్రంతో సెన్సేషన్ అయిన ఆయన.. అదే చిత్రాన్ని హిందీలోకి 'కబీర్ సింగ్' అనే టైటిల్‌తో రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ చిత్రం భారీ హిట్ అవడంతో అతడి పేరు హాట్ టాపిక్ అయిపోయింది. ఈ జోష్‌లోనే అతడు ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ హీరోగా 'యానిమల్' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

క్రేజీ కాంబినేషన్‌లో హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'యానిమల్' చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. అంతేకాదు, ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపుగా కంప్లీట్ అయింది. ఇక, ఈ మూవీని ఆగస్టు 11వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని అనుకున్నారు. అనివార్య కారణాలతో అప్పుడు విడుదల చేయని విషయం తెలిసిందే.

Ranbir Kapoor Starrer Animal Movie Teaser Out Now

రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న 'యానిమల్' మూవీ నుంచి ఇప్పటికే ప్రీ టీజర్‌ను విడుదల చేశారు. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా నేడు (సెప్టెంబర్ 28) ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. దీన్ని మాత్రం అన్ని ఎమోషన్స్ చూపించేలా ఓ రేంజ్‌లో కట్ చేశారు.

తాజాగా వచ్చిన 'యానిమల్' టీజర్‌లో రణ్‌బీర్ కపూర్‌ రోల్‌ను పలు షేడ్స్‌లో చూపించారు. ముఖ్యంగా అతడు తండ్రితో విభేదించడాన్ని హైలైట్ చేశారు. ఇదే విషయంపై రష్మికతో రణ్‌బీర్ జరిపే సంభాషణతో టీజర్‌ను మొదలెట్టారు. ఆరంభంలో క్యూట్‌ గాయ్‌లా కనిపించినా.. ఎండింగ్ సమయానికి ఎంతో క్రూరంగా కనిపించాడు. ఈ వేరియేషన్ చూపించడంలో అటు దర్శకుడు, ఇటు హీరో ఇద్దరూ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

మొత్తంగా 'యానిమల్' టీజర్ ఆద్యంతం అన్ని వర్గాల వాళ్లను ఆకట్టుకునేలా కట్ చేశారు. ఇందులో బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్ హైలైట్‌గా ఉన్నాయి. ఇక, టీజర్ చివర్లో హీరో రణ్‌బీర్ రక్తపు మడుగులో పడిపోయి ఉండడంతో సినిమాపై ఆసక్తిని పెంచేశారు. అదే సమయంలో దీనిపై ఉన్న అంచనాలు కూడా రెట్టింపు అయిపోతున్నాయి.

ఇదిలా ఉండగా.. రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న 'యానిమల్' మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మిస్తున్నారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా తదితరులు సంగీతాన్ని అందించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ వంటి వాళ్లు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 1వ తేదీన విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X