రణబీర్ కపూర్ పై కోర్టులో పిటీషన్ వేసిన మహిళ.. అపార్ట్ మెంట్ నుంచి గెంటేసిన వైనం!
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ పై కోర్టులో పిటీషన్ దాఖలైంది. సూర్య వంశీ అనే మహిళ రణబీర్ కపూర్ పై ఈ పిటీషన్ వేయడం ఆసక్తిగా మారింది. పుణెలోని రణబీర్ కపూర్ కు చెందిన ఓ పార్ట్ మెంట్ లో సూర్యవంశీ అనే మహిళ కుటుంబం నివాసం ఉంటోంది. ముందుగా కుదుర్చుకున్న అగ్రిమెంట్ ఒప్పందాన్ని ఉలంఘించాడని ఆరోపించింది.
గడువు ముగియక ముందే అపార్ట్ మెంట్ నుంచి బలవంతంగా గెంటేశారని ఆరోపిస్తూ 50 లక్షలు పిటిషన్ వేశారు. బలవంతంగా ఖాళీ చేయించడం వలన ఇబ్బందులు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు.

2016 లో సూర్యవంశీకి రణబీర్ తన అపార్ట్ మెంట్ ని నెలకు 4 లక్షల అద్దెకు 24 నెలల కాలానికి ఇచ్చాడు. కానీ 11 నెలలకే బలవంతంగా ఖాళీచేయించారని సూర్యవంశీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రణబీర్ నోటీసులు అందుకున్నాడు. రణబీర్ స్పందిస్తూ సూర్యవంశీ ఇష్టపూర్వకంగానే అపార్ట్ మెంట్ ఖాళీ చేశారని పేర్కొన్నాడు. కోర్టులో తమ వాదనని వినిపిస్తామని స్పష్టం చేశాడు.


Click it and Unblock the Notifications











