డిజిటల్ వరల్డ్ లోకి అడుగు పెట్టనున్న స్టార్ హీరో
తన నటనతో ఎంతోమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు బాలీవుడ్ యాక్టర్ రణ్ బీర్ కపూర్. ప్రస్తుతం ఈ హీరో 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తున్నాడు . ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్ కు జోడీగా అలియాభట్ నటిస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్, నాగార్జున ప్రధాన పాత్రం పోషిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. మరోవైపు త్వరలో రణ్ బీర్ డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెట్టనున్నాడని తెలుస్తుంది. త్వరలో వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇందుకోసం డిజిటల్ దిగ్గజం డిస్ని హాట్ స్టార్ రణ్ బీర్ తో సంప్రదింపులు జరుపుతుందని తెలుస్తుంది. ఇది క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ అని దీనిని 10 ఎపిసోడ్లుగా తెరకెక్కించనున్నారట. ఈ సిరీస్ జాన్ లే కారే రచించిన 1993 నవల ఆధారంగా రూపొందించబడింది. గతంలో ఈ సిరీస్ స్టోరీ హృతిక్ దగ్గరకు వెళ్ళింది.

కానీ కొన్నికారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు రణ్ బీర్ ఈ సిరీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సిరీస్ ను వివిధ దేశాల్లో చిత్రీకరించనున్నారు. మరో వైపు లవ్ రంజన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రణ్ బీర్. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.


Click it and Unblock the Notifications











