twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనూహ్యంగా పాత వీడియో వైరల్, చిక్కుల్లో స్టార్ నటుడు.. అరెస్ట్ చేయాలని డిమాండ్!

    |

    టెక్నాలజీ విరివిగా పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడో చేసిన తప్పులు కూడా మళ్ళీ మళ్ళీ కొంప ముంచే పరిస్థితికి తీసుకు వస్తున్నాయి. ఒక జాతీయ నేత గురంచి బాలీవుడ్ స్టార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కొంప ముంచుతున్నాయి. బాలీవుడ్లో విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న నటుడు రణదీప్ హుడా ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా 'రాధే'లో కూడా విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. గతంలో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, సాహెబ్ బివి ఔర్ గ్యాంగ్ స్టర్, హైవే లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అనుకోకుండా ఈ నటుడు ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు.

    దీంతో ఆయన్ని అరెస్ట్ చేయలంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమం నడుస్తోంది. దానికి కారణం గతంలో జరిగిన ఒక కామెడీ టాక్ షోలో భాగంగా అతను మాయావతి మీద ఒక అభ్యంతరకరమైన జోక్ పేల్చడమే. అది కామెడీ షో కావడంతో రణదీప్ ఒక వల్గర్ జోక్ వేశాడు.వల్గారిటీ ఉన్న ఆ జోక్‌ను ఇక్కడ ప్రస్తావించడానికి ఇబ్బందే, అలాంటి జోక్ పేల్చింది ఒక కామెడీ షోలో కాబట్టి పెద్దగా తప్పు పట్టడానికి లేదు. అయితే ఇది కొత్త వీడియో కూడా కాదు.

    Randeep Hooda lands in trouble for insensitive joke on Mayawati

    ఐతే ఎవరికి గుర్తు వచ్చిందో తెలియదు కానీ ఆ వీడియోను బయటికి తీసి ఇప్పుడు పోస్ట్ చేస్తూ ట్విట్టర్లో ట్రెండ్ కి తెర లేపింది. ఈ దెబ్బకి మిగతా వాళ్లు వైరల్ చేశారు. ఆ వీడియో ట్విట్టర్లో ట్రెండ్ కూడా అయిపోవడంతో #ArrestRandeepHooda అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. దళిత నేత మాయావతి గురించి ఇలాంటి జోక్ పేల్చడమేంటి.. ఇది దళితులను కించపరచడమే.. మహిళల్ని అవమానించడమే అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున, రణదీప్ మీద విరుచుకుపడుతున్నారు. ఐతే ఎప్పటి వీడియోనో పట్టుకొచ్చి ఇప్పుడు రణదీప్ మీద విమర్శలు చేయడం, అతన్ని అరెస్ట్ చేయాలని కోరడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం ఎందాకా వెళుతుందో ? చూడాలి మరి.

    English summary
    Bollywood actor Randeep Hooda was landed in controversy over his remarks against former UP CM Mayawati. The actor, who had taken part in an event in the past, made insulting remarks against the Bahujan Samaj Party chief.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X