క్వీన్ కు కౌంటర్ ఇచ్చిన రంగీలా బ్యూటీ...
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం మొదలుకుని నెపోటిజం, మూవీ మాఫీయా, డ్రగ్ మాఫియాపై మాటల తూటాలను సంధిస్తూ, ముంబైలో మినీ సునామీని సృష్టించిన కంగనకు అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చేందుకు వెటరన్ హీరోయిన్లు అందరూ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. రాజ్యసభలో కంగనను ఏకిపారేసిన జయకు ఓ వైపు మద్దతు పెరుగుతుండగా ఇప్పుడు రంగీలా బ్యూటీ కూడా బాలీవుడ్ ప్రతిష్ఠను కాపాడేందుకు నడుబిగించింది.
పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటోన్న ఊర్మిళ ఆ మధ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక, ఇండస్ట్రీలో కంగన చేస్తున్న హడావిడిని చూసి ముందుకు వచ్చిన ఊర్మిళ, అసలు హిమాచల్ ప్రదేశే డ్రగ్స్ కు పుట్టిల్లు అంటూ కంగనకు పెద్ద కౌంటర్ ఇచ్చింది.

కంగన అనవసరం విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తోందని, ప్రస్తుతం దేశమొత్తం మాదక ద్రవ్యాల ఉచ్చులో చిక్కుకుందని, అయితే కంగనకు నిజంగానే దమ్ముంటే సొంత రాష్ట్రంలో వేళ్లూనుకున్న గంజాయి సరఫరాను అడ్డుకోమని సవాలు చేసింది. అక్కడి నుంచే తన పోరాటం మొదలుపెట్టాలని సూచించింది. మరోవైపు ఈ మనిషికి టాక్స్ పేయర్ల నుంచి వసూలు చేస్తున్న పన్ను ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆమె వై సెక్యూరిటీకే ధారబోస్తున్నారని, ఇదంతా అవివేకమని తెలిపింది.
ముంబై అందరిదని, ఇది ఎందరికో జీవితాన్ని ఇచ్చిందని, మహారాష్ట్ర బిడ్డగా తన నగరాన్ని ఎవరన్నా దూషిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. అస్తమానం అరచినంత మాత్రాన్న ఆమె నిజమే మాట్లాడుతోందని కాదన్న ఊర్మిళ, కంగన పాలీ హిల్ ఆఫీస్ ధ్వంసం మాత్రం హర్షించదగ్గ పరిణామం కాదని స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications











