twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిందూమతాన్ని చులకన.. ప్రధానిని టెర్రిరస్టు అంటే.. ట్విట్టర్‌పై విరుచుకుపడ్డ కంగన సోదరి

    |

    కంగన రనౌత్ సోదరి రంగోలి చందేల్ అకౌంట్‌ను సస్పెండ్ చేస్తూ ట్విట్టర్ అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడంపై తీవ్రంగా స్పందించారు. అమెరికాకు చెందిన సంస్థ కావడం వల్లే ఇలా ద్వంద ప్రమాణాలను పాటిస్తున్నదని రంగోలి విరుచుకుపడ్డారు. తన అకౌంట్ సస్పెండ్ చేయడం వెనుక కుట్ర దాగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ట్విట్టర్‌ను టార్గెట్ చేస్తూ కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అవేమిటంటే.

    లాక్‌డౌన్ సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని

    లాక్‌డౌన్ సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని

    లాక్‌డౌన్ సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో వైద్యులు, పోలీసులపై కొందరు వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. టెర్రరిజానికి మతం లేదనే విషయాన్ని మన రాజ్యాంగం స్పష్టం చేసింది. ఎవరైనా రాజ్యాంగ్య అతిక్రమణకు పాల్పడితే శిక్షించాలి అంటూ రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    ట్విట్టర్ భారతీయ వ్యతిరేక విధానాలు

    ట్విట్టర్ భారతీయ వ్యతిరేక విధానాలు

    భారత వ్యతిరేక విధానాలను ట్విట్టర్ అకౌంట్ సమర్ధిస్తున్నది. నా ట్విట్టర్ అకౌంట్‌ను ఇక ముందు మళ్లీ పునరుద్దరించుకొను. మరోసారి ట్విట్టర్‌ను వాడను. తన సోదరికి నేను అధికార ప్రతినిధిని లాంటిదానిని. ఆమె ఆలోచనలనే నేను క్లియర్‌గా చెప్పాను అని రంగోలి చందేల్ అన్నారు.

    ట్విట్టర్ పక్షపాత ధోరణితో

    ట్విట్టర్ పక్షపాత ధోరణితో

    ట్విట్టర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నది. హిందూ దేవుళ్లను చులకన చేస్తే పెద్దగా పట్టించుకోదు. దేశ ప్రధాని, హోం మినిస్టర్లను ఉగ్రవాదులంటే స్పందించదు. కానీ కరోనావైరస్ గురైన వారికి పరీక్షలు చేస్తామని వచ్చే వైద్యులు, పోలీసులపై రాళ్లు విసిరితే మాత్రం.. వాటిని ఎంకరేజ్ చేస్తుంది. వాటి గురించి మాట్లాడితే నా అకౌంట్‌ను సస్పెండ్ చేస్తుంది. ఇది న్యాయమా? అని ప్రశ్నించారు.

    Recommended Video

    Nanadamuri Balakrishna Say No For Kangana Thalaivi
    మర్కతి సమావేశానికి వెళ్లి

    మర్కతి సమావేశానికి వెళ్లి

    ఢిల్లీలోని జమాతి మర్కతి సమావేశానికి వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి కరోనా కారణంగా చనిపోతే అతడిని చెక్ చేయడానికి వెళ్లిన డాక్టర్లు, వైద్యలును వెంటాడి తరిమి, రాళ్లతో కొట్టిన ఘటనను ట్విట్టర్‌లో చూపించింది. ఈ విషయంపై సెక్యులర్ వాదులు స్పందించాలి అంటూ ఘాటుగా రంగోలి స్పందించింది. ఈ ట్విట్‌ను చాలా మంది రిపోర్టు చేయడంతో ట్విట్టర్ అకౌంట్‌ను సస్పెండ్ చేస్తూ ట్విట్టర్ నిర్ణయం తీసుకొన్నది.

    English summary
    Kangana Ranaut sister Rangoli Chandel fire on twitter. Rangoli Candelo Twitter account suspended due to comments on Moradabad incident. So she angry over micro blogging site.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X