జాతి వ్యతిరేకులను పట్టించుకోకండి.. మోడీ ఉండటం అదృష్టం.. రంగోలీ చందేల్ ట్వీట్స్ వైరల్
కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. మానవాళి మొత్తాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా కుదేలైపోతోంది. అక్కడి జనం పిట్టల్లారాలిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల మంది కరోనా బారిన పడ్డారు. మనదేశంలోనూ రోజురోజుకూ పరిస్థితి విషమించిపోతోంది.

21 రోజుల లాక్ డౌన్..
మన దేశంలో కరోనా తాండవం చేస్తుండగా.. దాన్ని కట్టడి చేసేందుకు 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. అయినా అప్పటికే కొంత నష్టం జరిగినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ విధించినా, జనాలు రోడ్డు మీదకు రాకుండా ఇంటికే పరిమితమైనా.. కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.

ప్రధాని వీడియో సందేశం..
ప్రజలంతా కరోనాను ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నారని, లాక్ డౌన్‌ను మరింత కఠినంగా పాటించాలని కోరాడు. ఈ మేరకు ఏప్రిల్ 5న అందరం కలిసి కరోనా వైరస్ అనే అంధకారాన్ని తరిమికొట్టాలనే పిలుపునిచ్చాడు. 130కోట్ల మంది ప్రజలు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు బంద్ చేసి టార్చ్, మొబైల్ లైట్‌లు, కొవ్వొత్తులు, దివ్వెలు వెలిగించాలని, తద్వారా తాము ఒంటరి కాదనే సంకల్పాన్ని చాటి చెప్పాలని కోరాడు.
మోడీలాంటి వారుండటం అదృష్టం..
ప్రధాని సందేశంపై సెలెబ్రిటీలంతా స్పందిస్తున్న వేళ ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్ సైతం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. మోడీ వంటి నాయకుడిని కలిగి ఉండటం నిజంగా మన అదృష్టమని పేర్కొంది. దేశం కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోగలదని విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పిన సందేశాన్ని అనుసరించాలని సూచించింది.
Recommended Video

జాతి వ్యతిరేకులను పట్టించుకోకండి..
మన ప్రేమాభిమానాలతోపాటు దేశ సమైక్యతను చాటి చెప్పుదాం అని పేర్కొంది. ఇలాంటి సమయంలో జాతి వ్యతిరేకులను పట్టించుకోకండని తెలిపింది. దీపాలు వెలిగించడమనేది మంచి నిర్ణయం.. దాని వల్ల మన చుట్టూ పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతుందని చెప్పుకొచ్చింది. నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు తనకెంతో నచ్చిందని పేర్కొంది.


Click it and Unblock the Notifications











