twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాపీ కొట్టిన సినిమాకు ఆస్కార్ ఎలా ఇస్తారు..గల్లీబాయ్‌పై విరుచుకుపడ్డ రంగోలి

    |

    సినీ రంగంలో ఆస్కార్ అవార్డులు అత్యుత్తమమైనవి. యాక్టర్, డైరెక్టర్ ఇలా ప్రతీ ఒక్కరూ తమ సినీ కెరీర్‌లో ఒక్కసారైన ఆస్కార్ అందుకోవాలని కలలు కంటారు. అయితే మన ఇండియన్ సినిమాలకు ఆస్కార్ అందని ద్రాక్షగానే ఉంటుంది. ప్రతీ ఏడాది ఆస్కార్ ఎంట్రీ కోసం ప్రజాధరణ పొందిన సినిమాలను ఎంపిక చేసి పంపిస్తే.. వెనుదిరిగి రావడం మామూలవుతోంది. ఈ ఏడాది ఆస్కార్ బరిలో నింపేందుకు రణ్‌వీర్ సింగ్ నటించిన గల్లీబాయ్ చిత్రాన్ని ఎంపిక చేశారు.

    తుది జాబితాలో దక్కని చోటు..

    తుది జాబితాలో దక్కని చోటు..

    90 సినిమాల్లోంచి చివరకు 10 సినిమాలను మాత్రమే ఫైనల్ జాబితాగా తయారు చేయడం జరిగింది. ఆ పది సినిమాల్లో ఒక్క సినిమాకు ఆస్కార్ దక్కుతుంది. అయితే తుది 10 సినిమాల జాబితాలో గల్లీబాయ్ కు చోటు దక్కలేదు.

    రెచ్చిపోయిన రంగోలి..

    బాలీవుడ్‌ను, అందులోని ప్రముఖ హీరోలను, వారసత్వ హీరోహీరోయిన్లను టార్గెట్ చేయడంలో ముందుండే కంగనా సోదర రంగోలి చందేల్ మరోసారి రెచ్చిపోయింది. ఆస్కార్ బరి నుంచి గల్లీబాయ్ తప్పుకోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

    ఉరి, మణికర్ణిక లాంటి సినిమాలు..

    ఉరి, మణికర్ణిక లాంటి సినిమాలు..

    ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘8 మైల్ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా తెరకెక్కిన గల్లిబాయ్.. ఇక్కడి మాఫియా మెచ్చుకున్న మాత్రాన సరిపోతుందా? ఉరి, మణికర్ణిక లాంటి ఒరిజినల్ కంటెంట్ ఉన్న చిత్రం కాదు.. అలాంటప్పుడు అక్కడి నుంచి కాపి కొట్టిన చిత్రానికి వారెందుకు అవార్డు ఇస్తార'ని ప్రశ్నించింది.

    English summary
    Rangoli Chandel Fires On Gully Boy For Disappointment Of Oscar. This film is based on Hollywood film 8 Mile, yahan ke movie mafia chatukar critics ke chaatne se kya hota hai, it’s not original content like Uri and Manikarnika, why Hollywood will give award to a film which is copied from their film ?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X