సరోగసి ద్వారా బిడ్డను కన్న శిల్పాశెట్టి.. దానికంటే అదే ఉత్తమం.. మండిపడ్డ కంగనా సోదరి
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్.. ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకుంది. ఏ విషయంపైనా అయినా ఎంతటి వారినైనా కడిగిపారేస్తుంది. ఎవరు ఎమనుకుంటారని అస్సలు ఆలోచించదు. మొండిగా ముందుకు దూకెస్తుంది. మొన్నటి ఫిల్మ్‌ఫేర్ వేడుకల్లోనూ అందర్నీ చెడామడా తిట్టేసింది. అదొక మాఫియా అంటూ కరణ్ జోహర్‌ను ఆట ఆడేసుకుంది. తాజాగా శిల్పాశెట్టిపై పడింది.

బిడ్డకు జన్మనిచ్చిన శిల్పాశెట్టి..
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అదేలా.. ఎప్పుడూ గర్బంతో ఉన్నట్లు కనిపించలేదే అని అనుకుంటున్నారా? ఆమె కన్నది సరోగసీ (అద్దెగర్భం) ద్వారా. తమ ఇంట్లోకి దేవత వచ్చిందని శివరాత్రి పర్వదినాన ప్రకటించింది.
అందుకే ఆ పేరు పెట్టాం.
ఈ మేరకు శిల్పాశెట్టి పోస్ట్ చేస్తూ... ‘ఓం శ్రీ గణేషాయ నమః.. ఇన్నాళ్ల మా పూజాలకు అద్భుత ఫలితం దక్కింది. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. మా ఇంట్లోకి చిట్టితల్లి జూనియర్ ఎస్‌ఎస్‌కే వచ్చేసింది. ఫిబ్రవరి 15న ''సమీశా శెట్టి'' కుంద్రా ఈ లోకంలోకి అడుగు పెట్టింది. ఈ విషయం మాకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. స అంటే సంస్కృతంలో కలిగి ఉండటం అని అర్థం. మిశ అంటే రష్యన్ భాషలో దేవత. మా ఇంటి లక్ష్మి.. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసింది. మా ఏంజెల్‌కు మీ ఆశీర్వాదాలు కావాల'ని తెలిపింది.
ఆల్రెడీ ఉన్నవాళ్లను తీసుకోండి..
సరోగసీ విధానంపై రంగోలీ స్పందిస్తూ.. ‘నాకు ఒక బిడ్డ ఉంది. నా భర్త మరొకరిని కోరుకుంటున్నారు. అయితే తాము దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. సరోగసికి వెళ్ళడం కంటే దత్తత తీసుకోవటాన్ని జంటలు ప్రోత్సహించాలనుకుంటున్నాను. ప్రతీ ఒక్కరిని సొంతంగానే ఉండాలనుకుంటారు.. కానీ ఆల్రెడీ ఈ భూమ్మిద తల్లిదండ్రులు లేని పిల్లలకు ఓ ఇంటిని, పేరెంట్స్‌ను ఇవ్వాల'ని ట్వీట్ చేసింది.
Recommended Video


తన పేరు గంగ..
‘ఈ దత్తత విషయంలో తనకు సోదరే స్ఫూర్తి. అజయ్(భర్త) నేను కొన్ని నెలల్లో అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేశాము.. ఇంకొన్ని నెలల్లోనే మా ఇంట్లోకి ఓ చిట్టి పాపాయి రాబోతోంది. కంగనా తనకు గంగ అనే పేరు కూడా పెట్టేసింది. ఓ పాపకు ఓ ఇంటిని ఇవ్వగలగడం అదృష్టంగా భావిస్తున్నాన'ని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











