Don't Miss!
- Finance
Intel: షాకిచ్చిన ఇంటెల్ త్రైమాసిక ఫలితాలు.. ఒక్క రోజులోనే 8 బిలియన్ల డాలర్ల నష్టం..
- Sports
అర్ష్‌దీప్ సింగ్ వైఫల్యానికి కారణం అదే: మహమ్మద్ కైఫ్
- News
మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
ఎవరితో పడుకోవాలో.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఆయనే డిసైడ్.. కంగన సొదరి ఫైర్
బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్‌పై సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్, కంగన రనౌత్ సోదరి రంగొలి చండేల్ తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్‌ను ధర్మ ప్రొడక్షన్ సినిమాల్లో నుంచి కరణ్ తొలగించారని కమల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు రంగోలి ఆజ్యం పోశారు. ఇద్దరు కలిసి కరణ్ జోహర్‌పై పలు ఆరోపణలతో మండిపడ్డారు. ఇంతకు కొంత వివాదానికి కారణం ఏమిటంటే..

కరణ్ జోహర్ ఎలాంటి వాడంటే?
కరణ్ జోహర్‌పై రంగోలి చండేల్ ఇటీవల తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇషాన్‌ను కరణ్ జోహర్ వేధిస్తున్నాడు. ఫలానా హీరోయిన్‌తో కలిసి ఉండు.. ఆ హీరోయిన్‌కు బ్రేకప్ చెప్పు అంటూ కరణ్ శాస్తిస్తున్నాడు. తారల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాడు అంటూ కరణ్‌పై కంగన సోదరి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

ఇషాన్ కట్టర్ తొలగింపు
రంగోలి వ్యాఖ్యల నేపథ్యంలో కరణ్‌ను ఉద్దేశించి కమల్ ఆర్ ఖాన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నా సన్నిహితులు వెల్లడించిన ప్రకారం.. ధర్మ ప్రొడక్షన్ రూపొందించే సినిమాల్లో ఇషాన్ కట్టర్ ఉండరు. ఎదో సందర్భంలో కరణ్‌తో ఇషాన్ కొంత అనుచితంగా ప్రవర్తించాడు. అందుకే అతడిని ధర్మ ప్రొడక్షన్ నుంచి తొలగించాడు అని కమల్ పేర్కొన్నాడు. ఇషాన్‌ను జాహ్నవి కపూర్‌తో జంటగా ధడ్కన్ అనే చిత్రంలో నటింపజేసిన సంగతి తెలిసిందే.

ఆశ్చర్యం కలిగించలేదని
కమల్ ఖాన్ ట్వీట్ నేపథ్యంలో కంగన సోదరి రంగోలి స్పందించారు. కరణ్ ఆలాంటి వ్యక్తే. తనకు నచ్చకపోతే ఎంతకైనా దిగజారుతాడు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో కరణ్ సిద్ధహస్తుడు. ఇషాన్ తొలగించారనే వార్త నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఇలాంటివి ఆయన సొంత నిర్మాణ సంస్థల సాధారణమే అని రంగోలి అన్నారు.

బట్టలు, పడుకోవడం దగ్గర్నుంచి ఆయనే
తాను చేసే ఈవెంట్లు, పనుల్లో హీరో, హీరోయిన్లకు వచ్చే రెమ్యునరేషన్లలో ఎక్కువ భాగం కరణ్ జోహర్ తీసుకొంటాడు. ఈవెంట్లలో ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఆయనే చెబుతాడు. ఎవరు ఎవరితో పడుకోవాలనే విషయాన్ని కూడా కరణ్ జోహర్ నిర్ణయిస్తాడు. హాలీవుడ్‌లో ఇలాంటి సంప్రదాయం ఉంటుంది. అలాంటిది ఇక్కడ కరణ్ జోహర్ అమలు చేస్తున్నాడు అని రంగోలి ధ్వజమెత్తింది.