సోనమ్ కపూర్ మెహందిలో రాణి ముఖర్జీ.. కరణ్ జోహార్‌తో ఇంత హాట్ గానా!
బాలీవుడ్ బ్యూటీ వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. సోమవారం మెహందీ సెలెబ్రేషన్స్ తో ప్రారంభమైన సోనమ్ కపూర్ పెళ్లి సందడి నేటి వివాహ వేడుకతో కొనసాగనుంది. ఆనంద్ అహుజా, సోనమ్ కపూర్ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. బాలీవుడ్ సెలెబ్రిటీలు, సోనమ్ కపూర్ కుటుంబ సభ్యుల మధ్య మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి.
సోనమ్ కుటుంబ సభ్యులు జాన్వీ కపూర్, ఖుషి, అర్జున్ కపూర్, అన్షులా వంటి ప్రముఖులంతా హాజరయ్యారు. బాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ వేడుకలో ఆకర్షణగా మారారు. కత్రినా కైఫ్, కరణ్ జోహార్, జాక్వెలిన్, శిల్ప శెట్టి, రాణీముఖర్జీ, రేఖ వంటి స్టార్ సెలెబ్రిటీలంతా సోనమ్ మెహందీ వేడుకకు హాజరు విశేషం.

మెహందీ వేడుకకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. వాటిలో కొన్నిమాత్రం నెటిజన్లని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. రాణీ ముఖర్జీ, నిర్మాత కరణ్ జోహార్ కలసి ఇచ్చిన ఫోజు సోషల్ మీడియాలో యువతని కట్టిపడేసే విధంగా ఉంది. రాణీ ముఖర్జీ క్లివేజ్ షో చేస్తూ ఇచ్చిన హాట్ ఫోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











