twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొడుకుని సరిగ్గా పెంచరా.. హీరోయిన్ కామెంట్స్.. దుమ్ము దులుపుతున్న నెటిజన్లు!

    |

    సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ మీటూ ఉద్యమం గురించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగుతోంది. మీటూ ఉద్యమం గురించి ఓ జాతీయ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమానికి బాలీవుడ్ సెలెబ్రిటీలు దీపికా పదుకొనె, అనుష్క శర్మ, అలియా భట్, రాణి ముఖర్జీ హాజరయ్యారు. వేధింపులను ఎదుర్కొనడానికి మహిళలు ఇలా చేయాలి అని రాణి ముఖర్జీ ఇచ్చిన సలహా వివాదంగా మారుతోంది.

    పని ప్రదేశంలో రక్షణ

    పని ప్రదేశంలో రక్షణ

    ఈ కార్యక్రమంలో దీపికా, అనుష్క శర్మ మాట్లాడుతూ.. మహిళలు ఇంటి తర్వాత అంత సురక్షితంగా భావించేది పని ప్రదేశం. కాబట్టి మహిళలకు పని ప్రదేశంలో సరైన రక్షణ కల్పించాలని దీపికా, అనుష్క అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దీపికా, అనుష్క శర్మ పలు సందర్భాల్లో మీటూ ఉద్యమం గురించి స్పందించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ రాణి ముఖర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    మహిళలు బలవంతులై ఉండాలి

    మహిళలు బలవంతులై ఉండాలి

    రాణి ముఖర్జీ మాట్లాడుతూ.. మహిళలు బలవంతులుగా ఉండాలి. వేధింపులు ఎదురైనప్పుడు, పని ప్రదేశాల్లో లైంగిక దాడులు జరిగినప్పుడు మహిళలు వాటిని సమర్థవంతగా ఎదుర్కొనే విధంగా ఉండాలి. అందుకోవం మహిళలు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాలి. తద్వారా ఎలాంటి వేధింపులు ఎదురైనా మహిళలు తమని తాము రక్షించుకోగలరని రాణి ముఖర్జీ అభిప్రాయ పడ్డారు.

    <strong>Poll: 2018 ఉత్తమ తెలుగు చిత్రం</strong>Poll: 2018 ఉత్తమ తెలుగు చిత్రం

    జోక్ చేయడం లేదు కదా

    జోక్ చేయడం లేదు కదా

    రాణి ముఖర్జీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చుస్తున్నారు. మహిళలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలా.. అంతే కానీ తల్లిదండ్రులు తమ కొడుకులని సరిగ్గా పెంచనవసరం లేదు.. ఇదే కదా మేడం మీరు ఇచ్చే సలహా.. మీరు జోక్ చేయడం లేదు కదా.. మీరు చేసిన వ్యాఖ్యల వలన చాలా మంది అంతరాత్మ క్షోభించే విధంగా ఉంది.

    <strong>Poll: ఉత్తమ తెలుగు నటుడు 2018</strong>Poll: ఉత్తమ తెలుగు నటుడు 2018

     పసికందులపై

    పసికందులపై

    పసికందులపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోగాలరా.. మీరు ఇచ్చిన సలహా సరైనది కాదు. తల్లి దండ్రులు తమ పిల్లలని సత్ప్రవర్తనతో పెంచడమే ముఖ్యం అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మహిళలపై ఎన్ని దాడులు జరిగినా రాణి ముఖర్జీ ఇలాంటి సలహా ఇవ్వడానికి కారణం ఉంది. బాలీవుడ్ లో బడా నిర్మాతలలో ఒకరు అయినా ఆదిత్య చోప్రా సతీమణి రాణి ముఖర్జీ. ఆమె సొంత ప్రొడక్షన్స్ లోనే మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

    English summary
    Rani Mukerji Disagrees With Deepika, Alia & Anushka on MeToo, Gets Slammed on Social Media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X