షారుక్ కొడుకుతో సల్మాన్ కూతురు వివాహం.... నటి సంచలనం!
Recommended Video

షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ బాలీవుడ్ పరిశ్రమను ఏలుతున్న స్టార్ హీరోలు. కెరీర్ తొలి నాళ్ల నుండి ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఆ మధ్య ఇద్దరి మధ్య చిన్న విబేధాలు వచ్చి విడిపోయినా మళ్లీ కలిసిపోయారు. సల్మాన్ ఖాన్ సినిమాలు, టీవీ షోలలో షారుక్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం... షారుక్ సినిమాల్లో దర్శనమిచ్చి సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుండటం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే వీరి స్నేహం మరో లెవల్‌కి వెళ్లాలని, బంధువులుగా మారాలని ఆశ పడుతోంది బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ.

షారుక్ కొడుకుతో సల్మాన్ కూతురు వివాహం
షారుక్ ఖాన్ కుమారుడు అబ్ రామ్‌తో... సల్మాన్ ఖాన్ కూతురు వివాహం జరుగాలని తాను కోరుకుంటున్నట్లు రాణి ముఖర్జీ ఇటీవల ఓ టీవీ షోలో వ్యాఖ్యానించడం సంచలనం అయింది.

పెళ్లి గురించి మచిపో, పిల్లలను కనేయ్
ఇంకా సల్మాన్ ఖాన్ పెళ్లే చేసుకోలేదు రాణి ముఖర్జీ ఇలాంటి వ్యాఖ్యలు చేసిందేంటని అంతా ఆశ్చర్యపోయేలోపే.... పెళ్లి గురించి వదిలేయ్, పిల్లను కనేయ్ అంటూ సల్మాన్‌కు అడ్వైజ్ ఇవ్వడం ద్వారా అందరినీ ఆశ్చర్య పరిచింది.

దస్ కా దమ్ కార్యక్రమానికి
సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘దస్ కా దమ్' గ్రాండ్ ఫినాలేకు షారుక్ ఖాన్, రాణీ ముఖర్జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాణీ ముఖర్జీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సరోగసీ విధానం ఉందిగా
బాలీవుడ్లో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోకుండా సరోగసీ విధానం ద్వారా తండ్రి అయ్యారు. కరణ్ జోహార్, తుషార్ కపూర్ ఈ విధానం ఎంచుకున్న సంగతి తెలిసిందే. మరికొందరు మరికొందరు దత్తత తీసుకుని పేరెంట్స్ కావాలనే తమ ముచ్చట తీర్చుకున్నారు. మరి రాణి ముఖర్జీ సూచన మేరకు సల్మాన్ ఖాన్ ఏ ఆప్షన్ ఎంచుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











