Mrs Chatterjee Vs Norway నార్వే ప్రభుత్వంపై ఎన్నారై తల్లి పోరాటం.. రాణిముఖర్జీ గుండెను పిండేసే ఫెర్ఫార్మెన్స్

తమ ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం నార్వే ప్రభుత్వంతో ఎన్నారై దంపతులు జరిపిన పోరాటం నేపథ్యంగా మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రం రిలీజ్‌కు సిద్దమవుతున్నది. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఫిబ్రవరి 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎమోషనల్ అంశాలతో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించే అంశాలు ఉన్నాయి. ఈ సినిమా కథ వివరాల్లోకి వెళితే..

నార్వేలో 2011 సంవత్సరంలో అనురూప్, సాగరిక భట్టాచార్య ఇద్దరు పిల్లలను వర్నేవార్నే అనే నార్వే చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్ తమ ఆధీనంలోకి తీసుకొని ఓ ఫాస్టర్ సంరక్షణకు అప్పగించింది. సరైన బెడ్ రూమ్ లేదు. వారికి తగిన దుస్తులు, భోజన సదుపాయాలు లేవనే ఆరోపణలతో ఇద్దరు పిల్లల్ని నార్వే ప్రభుత్వం తీసుకెళ్లింది. అయితే తమ పిల్లలను తమకు అప్పగించాలని సాగరిక దంపతులు పోరాటం చేశారు. అంతర్జాతీయ స్థాయిని ఆకర్షించిన ఈ వివాదాన్ని పరిష్కరించడానికి భారత్, నార్వే దేశాల దౌత్య అధికారులు జోక్యం చేసుకొన్నారు. అనంతరం సాగరిక వద్దకు ఇద్దరు పిల్లల్ని చేర్చేలా ఇరు దేశాలు సఫలమయ్యాయి.

 Rani Mukherjees Mrs Chatterjee Vs Norway trailer getting good response in Social media.

భావోద్వేగమైన కథగా రూపొందిన ఈ సినిమాను ప్రస్తుతం రాణి ముఖర్జీ కీలక పాత్రలో తెరకెక్కింది. మార్చి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.

మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రాన్ని ఇటీవల చూసిన దర్శకుడు కరణ్ జోహర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో రాణి ముఖర్జీ చేసిన అత్యుత్తమ నటన ఇదే. ఆగ్రహం, ప్రేమ, భావోద్వేగంతో కూడిన తల్లి పాత్రలో రాణి ముఖర్జీ ఒదిగిపోయారు. ఈ చిత్రంలో జిమ్ సర్బ్, నీనా గుప్తా తదితరులు అద్భుతంగా నటించారు. అషిమా చిబ్బర్ దర్శకత్వం బాగుంది అని కరణ్ జోహర్ ప్రశంసల వర్షం కురిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X