సింగింగ్ సెన్సేషన్ రణు కూతురు రంగంలోకి... డబ్బు విషయంలో రచ్చ రచ్చ!

ఇంటర్నెట్ సింగింగ్ సెన్సేషన్ రణు మొండల్ కుమార్తె ఎలిజబెత్ సతీ రాయ్ తన తల్లి గురించి చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. తన తల్లి చుట్టూ ఉన్నవారు ఆమెను తప్పుతోవ పట్టిస్తున్నారని, తద్వారా వారు ప్రయోజనం పొందుతున్నారని ఆరోపించారు.

రణు మొండల్ మేనేజర్, ఆమెను చూసుకుంటున్న అమ్రా షోబాయి షోయితాన్ క్లబ్ సభ్యులు తన తల్లిని కలవకుండా అడ్డు పడుతున్నారని, కలవడానికి వస్తే కాలు విరగ్గొడతామని బెదిరిస్తున్నారని ఎలిజబెత్ సతీ రాయ్ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై రణు మండల్ స్పందించారు. ఇలాంటి ఆరోపణలు రావడం బాధగా ఉందని తెలిపారు.

ఎవరో రెచ్చగొట్టి ఉంటారు

ఎవరో రెచ్చగొట్టి ఉంటారు

‘‘నా కూతురు సతీ వారిని తప్పుగా అర్థం చేసుకుందని భావిస్తున్నాను లేదా ఆమె ఇలా మాట్లాడేలా ఎవరైనా రెచ్చగొట్టి ఉండాలి. అతింద్ర (రణు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తి), తపన్ (క్లబ్ సభ్యుడు) నన్ను బాగా చూసుకుంటున్నారు. సతీని బెదిరించడం నాకు తెలియదు, "అని రణు తెలిపారు.

నా తల్లి డబ్బు దుర్వినియోగం చేస్తున్నారు

నా తల్లి డబ్బు దుర్వినియోగం చేస్తున్నారు

కాగా.. క్లబ్ సభ్యులు తన తల్లి డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని సతీ ఆరోపించారు. కిడ్స్ సింగింగ్ రియాలిటీ షోకు గెస్ట్‌గా వెళ్లినందుకు రణు రూ.50 వేల పారితోషికం అందుకున్నారు, తపన్ తన నిత్యావసర వస్తువుల కొనుగోలు చేయాలనే నెపంతో నా తల్లి నుండి డబ్బు తీసుకుంటున్నాడు. అమ్మ ఖాతా నుండి రూ .10,000 తీసుకున్న విషయం నా దృష్టికి వచ్చింది. అంత డబ్బు తీసుకుని ఆమె కోసం ఒక సూట్‌కేస్, కొన్ని నైటీలను మాత్రమే కొనుగోలు చేశారు. నేను వారిని అస్సలు నమ్మను "అని సతి పేర్కొన్నాడు.

డబ్బు తీసుకున్నది నిజమే, కానీ అందుకోసం కాదు

డబ్బు తీసుకున్నది నిజమే, కానీ అందుకోసం కాదు

డబ్బు దుర్వినియోగంపై రణు స్పందిస్తూ... "నేను ఆర్టిస్ట్ కావడం వల్ల నాకు డబ్బు గురించిన ఆలోచన లేదు. నాకు పాడే అవకాశం లభిస్తే చాలు. అలాగే, జీవించడానికి మనందరికీ ఆహారం, సరైన బట్టలు, ఉండటానికి మంచి ప్రదేశం అవసరం; దేవుని దయ ద్వారా నాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అవును వారు 10,000 రూపాయలు తీసుకున్నారు, కాని అప్పుడు అది ఇంటి వస్తువులు, బట్టలు, వంట గ్యాస్, ప్రయాణ ఛార్జీల కొనుగోలులో ఉపయోగించబడింది. నాకు వారిపై పూర్తి నమ్మకం ఉంది " అన్నారు.

ఇన్నాళ్లు ఆమె ఎక్కడికి వెళ్లింది?

ఇన్నాళ్లు ఆమె ఎక్కడికి వెళ్లింది?

"ఇన్ని సంవత్సరాలు ఆమె (సతీ) ఎక్కడ ఉంది? ఆమె అప్పుడప్పుడు రణుజీకి రూ .200 లేదా రూ .500 పంపుతుందని మాకు తెలిసింది. అయితే అది సరిపోతుందా? రణూజీ రణఘాట్ స్టేషన్‌లో పాడేవారు, కోల్‌కతా సందులు, బైలెన్‌లలో తిరుగుతూ ఉండేవారు, ఆమె కుమార్తె అప్పుడు ఎందుకు కేర్ తీసుకోలేదు? ఆమె మమ్మల్ని దుర్భాషలాడటానికి ప్రయత్నిస్తోంది తప్ప మరేమీ లేదు, "అని అతింద్ర వ్యాఖ్యానించారు.

నిజా నిజాలు వారికి తెలుసు

నిజా నిజాలు వారికి తెలుసు

తపన్ మాట్లాడుతూ.. రణఘాట్ రైల్వేష్టేషన్ సమీపంలో రణు నివాసం ఉండే బెగోపారాలో ప్రాంతంలో ఉండే ఇరుగు పొరుగు వారికి వాస్తవం తెలుసు. సతీ ఏం చేసేందో వారికి తెలుసు. అయినా మాకు మా ఉద్యోగాలు ఉన్నాయి, మేము మనుగడ సాగించడానికి ఎవరి డబ్బు అవసరం లేదు, రూ. 10వేలు రణు జీ నుంచి తీసుకోవాల్సిన అవసరం అసలే లేదు. మేము గత నెల నుండి రణుజీతో ఉన్నాము; మేము ఇప్పటి వరకు ఆమెకు చేసిన సహాయాన్ని నాశనం చేయడంలో అర్థం లేదు.'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X