దీపిక-రణవీర్ పెళ్లి సందడి షురూ... శుభవార్త చెబుతూ లేఖ!

Recommended Video

Ranveer Singh & Deepika Padukone Confirmed About Their Wedding

దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట ఆ వేడుక ఎప్పుడు జరుగుతుందనే విషయమై సస్పెన్స్ కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఎట్టకేలకు వివాహ తేదీని ప్రకటించారు.

తమ పెళ్లి తేదీని ప్రకటిస్తూ రణవీర సింగ్-దీపిక పదుకోన్ అభిమానులకు ఓ లేఖ విడుదల చేశారు. రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. నవంబర్ 14, 15 తేదీల్లో వివాహ వేడుక జరుగనున్నట్లు అందులో పేర్కొన్నారు.

దీపిక-రణవీర్ లేఖ

‘‘మా రెండు కుటుంబాల ఆశీస్సులతో 14, 15 నవంబర్ 2018 తేదీల్లో పెళ్లి చేసుకోబోతున్నాం. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అభిమానులు మాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. జీవితంలో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి''ని ఆ లేఖలో పేర్కొన్నారు.

పెళ్లి వేడుక ఎక్కడ?

పెళ్లి వేడుక ఎక్కడ?


అయితే పెళ్లి వేడుక ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని దీపిక-రణవీర్ వెల్లడించలేదు. అయితే వీరి వివాహం ఇటలీలోని లేక్ కోమోలో జరుగబోతోందని కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

 ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ

ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ

2013లో వచ్చిన సంజయ్ లీలా భన్సాలీ మూవీ ‘రామ్-లాలీ' చిత్రంలో కలిసి నటించిన ఈ జంట ప్రేమలో పడ్డారు. క్రమక్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడింది. 2016లో కరణ్ జోహార్ చాట్ షో కాపీవిత్ కరణ్ కార్యక్రమంలో రణవీర్ సింగ్ తొలిసారిగా దీపికను పెళ్లి చేసుకోబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

 పరిమిత సంఖ్యలో

పరిమిత సంఖ్యలో

ఇటలీలో జరిగే దీపిక-రణవీర్ డెస్టినేషన్ వెడ్డింగులో పరిమిత సంఖ్యలో అతిథులు పాల్గొననున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. ఇండియా తిరిగొచ్చిన తర్వాత బెంగుళూరు, ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X