»   » దీపికా పదుకొనె, రణవీర్ పెళ్లి భాజాలు.. ముహూర్తం ఫిక్స్, చాలా రహస్యంగా!

దీపికా పదుకొనె, రణవీర్ పెళ్లి భాజాలు.. ముహూర్తం ఫిక్స్, చాలా రహస్యంగా!

Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లో దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ హాట్ కపుల్స్. వీరి ఘాడమైన ప్రేమ వ్యవహారం గురించి అందరికి తెలిసిందే. గత ఐదేళ్లుగా దీపికా, రణవీర్ ప్రేమాయణం సాగిస్తున్నారు. సహజీవనం చేస్తున్నారని కూడా వార్తలు ఉన్నాయి. తామిద్దరం ప్రేమలో ఉన్న విషయాన్ని దీపిక అంగీకరించినా, సహజీవనం విషయాన్ని మాత్రం ఇంత వరకు బయటపెట్టలేదు. ఇక ఆ ఇబ్బంది దీపికా పదుకునే ఉండదేమో. ఈ జంట వివాహ బంధంతో త్వరలోనే ఒక్కటి కాబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పెద్దల అంగీకారంతో దీపికా, రణవీర్ జంట ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది.

 బాలీవుడ్‌లో హాట్ కపుల్స్

బాలీవుడ్‌లో హాట్ కపుల్స్

రామ్ లీలా చిత్రంలో జంటగా నటించినప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ మొదలైంది. ఐదేళ్లుగా వీరి ప్రేమ బంధం బలపడుతూనే ఉంది. ఏ ఫంక్షన్ కు వెళ్లినా వీరిద్దరూ జంటగానే దర్శనం ఇస్తున్నారు.

కెమిస్ట్రీ అదుర్స్

కెమిస్ట్రీ అదుర్స్

రామ్ లీలా చిత్రంలో ఈ జంట మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రీల్ లైఫ్ కెమిస్టీ వీరి మధ్య రియల్ లైఫ్ లో కూడా పనిచేసింది. రణవీర్, దీపికా రహస్యంగా సహజీవనం చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

పెళ్లి కబురు

పెళ్లి కబురు

దీపికా, రణవీర్ పెళ్లి గురించి ఎప్పుడు వార్త బయటకు వచ్చినా అది ప్రధాన అంశంగా మారుతోంది. ఆ మధ్యన వీరిద్దరూ రహస్య వివాహం చేసుకున్నారు అంటూ కూడా గుసగుసలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ జంట త్వరలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ముహూర్తం ఫిక్స్

ముహూర్తం ఫిక్స్

దీపికా, రణవీర్ కుటుంబ సభ్యులు అంగీకారంతో వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహ కార్యక్రమాలకు సెప్టెంబర్, డిసెంబర్ మధ్యలో నాలుగు తేదీల్ని ఖరారు చేశారట. అత్యంత రహస్యంగా వీరి వివాహం కుటుంబ సభ్యులు, కొద్ది మంది స్నేహితుల సమక్షంలో మాత్రమే జరగబోతున్నట్లు సమాచారం.

దీపికా షాపింగ్ మొదలుపెట్టేసింది

దీపికా షాపింగ్ మొదలుపెట్టేసింది

పెళ్లికి కావలసిన వస్త్రాలు, ఆభరణాల కోసం దీపికా ఇప్పటికే షాపింగ్ మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె సన్నిహితులు మాత్రం వివాహ విషయం గురించి సైలెంట్ మైంటైన్ చేస్తున్నారు.

త్వరలోనే వేదిక ఖరారు

త్వరలోనే వేదిక ఖరారు

వీలైనంత త్వరగా వివాహ వేదికని ఖరారు చేయాలని ఇరు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. హిందూ సంప్రదాయంలో దీపికా, రణవీర్ వివాహం జరగబోతోంది. వీరి వివాహం జరుగుతుందా లేక అనుష్క, కోహ్లీ వలె విదేశాల్లో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

English summary
Ranveer and Deepika will going to marry soon. Their parents fix date for wedding.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X