ఆమెను చూడగానే కౌగిలించుకొని.. ముద్దు పెట్టేయాలనిపిస్తుంది.. రణ్‌వీర్ సింగ్
ఆరేళ్లపాటు అఫైర్‌లో ఉండి గతేడాది పెళ్లి చేసుకొన్న దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్ ఇంకా ప్రేమ పక్షుల్లానే కనిపిస్తున్నారు. కాస్త గ్యాప్ దొరికితే చాలూ తట్టుకోలేక ప్రేమను ఒలకబోస్తూ కనిపిస్తుంటారు. తాజాగా భార్యపై ఉన్న ప్రేమను రణ్‌వీర్ వెల్లడించారు. దీపికాకు దూరమైతే తాను తట్టుకోలేనని పేర్కొన్నారు. అందుకే పబ్లిక్‌లో కూడా ప్రేమను వ్యక్తం చేస్తుంటాను అని అన్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దీపికా నాకు దూరంగా ఉంటే.. ఆ విరహాన్ని తట్టుకోలేనని, అందుకే ఆమె నాకు చాలా కాలం దూరంగా ఉండి.. నా ముందు కనిపిస్తుందో అప్పుడే గట్టిగా కౌగిలించుకొంటాను. ఆమెపై ముద్దుల వర్షం కురిపిస్తాను అని రణ్‌వీర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

రణ్‌వీర్ చెప్పిన మాటలకు తన అభిమానులు ఫిదా అయ్యారు. భార్యపై ఎంత ప్రేమను చూపిస్తాడో అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. భార్య గురించి చెప్పిన మాటలు విన్న తర్వాత రణ్‌వీర్‌ను ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తున్నది అని ఓ అభిమాని అన్నారు.
సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన రామ్ లీలా అనే చిత్రం షూటింగ్‌లో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ ప్రేమలో ప్డారు. ఆ తర్వాత భన్సాలీ రూపొందించిన బాజీరావు మస్తానీ, పద్మావతి చిత్రంలో నటించారు. సుదీర్ఘమైన డేటింగ్ తర్వాత గతేడాది వారిద్దరూ పెళ్లి చేసుకోవడం తెలిసిందే. కెరీర్ పరంగా, దీపిక, రణ్‌వీర్ ఇద్దరు కలిసి 83 అనే చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











