పెళ్లికి ముందే.. దీపిక పదుకోన్‌ నా పిల్లలకు తల్లి అవుతుందనే విషయం అర్థమైంది!

బాలీవుడ్ స్టార్స్ దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ దాదాపు ఆరేళ్లు ప్రేమలో మునిగి తేలిన అనంతరం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ 14న వీరి వివాహం ఇటలీలోని లేక్ కోమోలో జరిగింది. ఇరుకుటుంబాల పెద్ద సమక్షంలో ఈ ప్రేమ జంట వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు.

తాజాగా ఇండియా టుడే కంక్లేవ్‌లో పాల్గొన్న రణవీర్ సింగ్ తన కెరీర్, సినిమాలు, వరుసగా అందుకుంటున్న విజయాలతో పాటు దీపికతో తన రిలేషన్‌షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆమెను సొంతం చేసుకోవడానికి ఆరేళ్లు ఫీల్డింగ్ చేశాను

ఆమెను సొంతం చేసుకోవడానికి ఆరేళ్లు ఫీల్డింగ్ చేశాను

దీపికను నా సొంతం చేసుకోవడానికి ఆరేళ్ల పాటు ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆమె నా సొంతం అయింది. మా రిలేషన్‌షిప్‌లో ఎన్నో మరుపురాని సంఘటనలు ఉన్నాయి అని ఈ సందర్భంగా రణవీర్ సింగ్ గుర్తు చేసుకున్నాడు.

పెళ్లికి ముందే ఆమెతో పిల్లలు కంటాననే విషయం అర్థమైంది

పెళ్లికి ముందే ఆమెతో పిల్లలు కంటాననే విషయం అర్థమైంది

ఆరు నెలల రిలేషన్ షిప్ తర్వాత ఆమె నా జీవిత భాగస్వామి అని డిసైడ్ అయ్యాను. పెళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలిని నిర్ణయించుకున్నాను. అప్పటికి మాకు ఇంకా పెళ్లి కాలేదు. కానీ నేను పిల్లలు కనబోయేది దీపికతోనే అని అర్థమైంది... అని రణవీర్ సింగ్ చెప్పుకొచ్చారు.

డబ్బు చాలా గొప్పది, కానీ..

డబ్బు చాలా గొప్పది, కానీ..

డబ్బు చాలా గొప్పది.. కానీ నేను డబ్బు కోసం పని చేయను. యాక్టింగ్ అనేది నా నిజమైన ఫాషన్. తాము ఇష్టపడిన పనిని చేసే అవకాశం కొందరికి మాత్రమే దక్కుతుంది. అలాంటి లక్కీ ఫెల్లోల్లో నేనూ ఒకడిని అని రణవీర్ సింగ్ చెప్పుకొచ్చారు.

ఆమె రాకతో నా జీవితం మరింత సంతోషంగా

ఆమె రాకతో నా జీవితం మరింత సంతోషంగా

దీపిక రాకతో నా జీవితం మరింత సంతోషంగా మారింది. ఎప్పుడూ లేని ఒక కొత్త అనుభూతి, ఫీలింగ్ నా సొంతం అయింది. వరుస సినిమా విజయాలు మరింత ఆనందాన్ని ఇస్తున్నాయి అని రణవీర్ సింగ్ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X