For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దీపిక - రణ్‌వీర్ విడాకులు: నగ్నంగా చేసిన పని వల్లే.. హీరోనే స్వయంగా చెప్పడంతో!

  |

  గ్లామర్ ఫీల్డులో ఆర్టిస్టుల మధ్య ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తుంటాయన్న విషయం తెలిసిందే. కానీ, వాటిలో కొన్ని జంటలు మాత్రమే పెళ్లి పీటల వరకు వెళ్తుంటాయి. అలా చాలా కాలం పాటు ప్రేమించుకుని అగ్నిసాక్షిగా ఒక్కటైన జోడీల్లో దీపిక పదుకొనే.. రణ్‌వీర్ సింగ్ జంట ఒకటి. ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ స్టార్లుగా వెలుగొందుతోన్న ఈ ఇద్దరూ.. కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు.

  అప్పటి నుంచి తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారంపై రణ్‌వీర్ స్పందించాడు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

   ఇద్దరూ వాళ్లతో ప్రేమాయణాలు

  ఇద్దరూ వాళ్లతో ప్రేమాయణాలు

  దీపిక పదుకొనే.. రణ్‌వీర్ సింగ్ సుదీర్ఘ కాలంగా బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. వీళ్లిద్దరూ కలవడానికి ముందు వరకూ కొన్ని ప్రేమ వ్యవహారాలను నడిపిన విషయం తెలిసిందే. రణ్‌వీర్ ఒకరిద్దరు హీరోయిన్లతో డేటింగ్ చేయగా... దీపిక మాత్రం క్రికెటర్లు ధోనీ, యువరాజ్ సింగ్‌లో లవ్ ట్రాక్ నడిపింది. అలాగే, కొందరు హీరోలతోనూ డేటింగ్ చేసి దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది.

  Bigg Boss Elimination: చివరి రోజు మారిన ఓటింగ్.. డేంజర్ జోన్‌లోకి మోడల్.. ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్

  ప్రేమలో పడి... పెళ్లి చేసుకుని

  ప్రేమలో పడి... పెళ్లి చేసుకుని


  బాలీవుడ్‌ జంట దీపిక పదుకొనే.. రణ్‌వీర్ సింగ్ 2012లో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి దాదాపు ఆరేళ్ల పాటు సీక్రెట్‌గా డేటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే 2018లో వీళ్లిద్దరూ అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండడంతో పాటు పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు నడుపుకుంటున్నారు.

  ఎన్నో సినిమాలు.. జంటగానూ

  ఎన్నో సినిమాలు.. జంటగానూ

  వివాహం తర్వాత కూడా దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్ వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్లిద్దరూ ఇటీవలే '83' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది పరాజయం పాలైంది. ఇక, ఇప్పుడు దీపిక 'పఠాన్', 'ఫైటర్', 'ప్రాజెక్ట్K' వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలాగే, రణ్‌వీర్ 'సర్కస్', 'రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ' చేస్తున్నాడు.

  హీరోయిన్ శ్రీయ ఎద అందాల జాతర: వామ్మో అలా పడుకుని మరీ!

  దీపిక - రణ్‌వీర్ విడాకులు అని

  దీపిక - రణ్‌వీర్ విడాకులు అని

  బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్‌ తమ వైవాహిక బంధాన్ని చక్కగా నడుపుకుంటున్నారు. అయితే, వీళ్లిద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయని, ప్రస్తుతం దూరం దూరంగా ఉంటున్నారని దేశ వ్యాప్తంగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు, త్వరలోనే దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్‌ జంట విడాకులను కూడా ప్రకటించబోతుందని ప్రచారం జరుగుతోంది.

  నగ్నంగా కనిపించడం వల్లేనా

  నగ్నంగా కనిపించడం వల్లేనా

  దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్‌ విడాకులు తీసుకుంటున్నారన్న వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. దీంతో అసలు వీళ్లు ఎందుకు దూరం అవబోతున్నారన్న దానిపైనా ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రణ్‌వీర్ సింగ్ ఇటీవలే న్యూడ్ ఫొటోషూట్ చేసి వివాదంలో చిక్కుకోవడం వల్లే దీపికా అతడికి దూరం అవుతుందని ఓ టాక్ వినిపిస్తోంది.

  శృతి మించిన ప్రియ ప్రకాశ్ హాట్ షో: తడిచిన దేహంతో మెంటలెక్కించేలా!

  క్లారిటీ ఇచ్చిన రణ్‌వీర్ సింగ్

  క్లారిటీ ఇచ్చిన రణ్‌వీర్ సింగ్

  తన భార్య దీపిక పదుకొనేకు విడాకులు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలపై రణ్‌వీర్ సింగ్ తాజాగా స్పందించాడు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఆ వార్తలను కొట్టిపడేశాడు. '2012 నుంచి మేము డేటింగ్ ప్రారంభించాం.. మా ప్రేమకు ఈ ఏడాదితో పదేళ్లు పూర్తయ్యాయి. ఆమె అంటే నాకు చాలా గౌవరం. తనని ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటా' అంటూ పుకార్లను ఖండించాడు.

  త్వరలోనే సర్‌ప్రైజ్ ఇస్తానని

  త్వరలోనే సర్‌ప్రైజ్ ఇస్తానని

  ఇదే సందర్భంలో రణ్‌వీర్ సింగ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించాడు. 'దీపికా నా జీవితంలోకి రావడం పట్ల కృతజ్ఞుడగా ఉన్నాను. వ్యక్తిగత జీవితంలో దీపిక నుంచి చాలా నేర్చుకున్నా. మీ అందరికీ ఒక మంచి సర్‌ప్రైజ్ ఉంది. త్వరలోనే మా ఇద్దరిని కలిసి చూస్తారు' అంటూ వెల్లడించాడు. దీంతో వీళ్లు మళ్లీ జంటగా నటిస్తారని వార్తలు వస్తున్నాయి.

  English summary
  Bollywood Couple Ranveer Singh and Deepika Padukone Divorce News Gone Hot Topic Nationwide. Now This Star Hero Gave Clarity On This
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X