దీపికా, రణ్‌వీర్ ఒక్కటయ్యారు.. ఐదేళ్ల లవ్‌ అఫైర్‌కు శుభం కార్డు!

బాలీవుడ్‌లో హాటెస్ట్ కపుల్ దీపికా పదుకొన్, రణ్‌వీర్ సింగ్ జీవితంలో ఓ మజిలీ ముగిసింది. లవ్ ఎఫైర్‌కు శుభం కార్డు వేసి దాంపత్య జీవితానికి తెర లేపారు. ఈ సినీ ప్రేమ పక్షుల వివాహాం ఇటలీలో నవంబర్ 14వ తేదీన లేక్ కోమోలోని విల్ల డెల్ బాల్బేనెల్లోలో వివాహం ఘనంగా జరిగింది. దీపిక, రణ్‌వీర్ వివాహాన్ని సంప్రదాయ చిత్రపుర్ సరస్వత్ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. దీపికా పదుకొన్ కర్ణాటకలోని సరస్వత్ బ్రాహ్మణ కమ్యూనిటికి చెందిన వారని తెలిసిందే. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

 దీపిక, రణ్‌వీర్ పెళ్లి

దీపిక, రణ్‌వీర్ పెళ్లి

నవంబర్ 14న దీపికా, రణ్‌వీర్ ఒక్కటయ్యారు. పెళ్లి పీటల మీదకు వచ్చే సమయంలో దీపికా పదుకొన్ బంగారం రంగులో ఉండే సవ్యసాచి చీరను కట్టుకొన్నారు. రణ్‌వీర్ కంజీవరం షేర్వానీ ధరించారు. వీరి పెళ్లి తంతు చాలా ఉత్సాహంగా జరిగినట్టు తెలిసింది.

కాళ్లు కడిగిన దీపిక పదుకోన్ తండ్రి

కాళ్లు కడిగిన దీపిక పదుకోన్ తండ్రి

సోమవారం (నవంబర్ 12) రాత్రి సాంప్రదాయ ఫూల్ మడ్డీ కార్యక్రమంలో పెళ్లి ఉంగరాలు మార్చుకొన్నారు. ఈ సందర్భంగా మోకాళ్లపై కూర్చొని రణ్‌వీర్ మరోసారి తన ప్రేమను వ్యక్తం చేశాడు. దీపిక తండ్రి ప్రకాశ్ పదుకొన్ పెళ్లి కొడుకు కాళ్లు కడిగి ఆ తర్వాత కొబ్బరికాయను రణ్‌వీర్ చేతిలో పెట్టినట్టు తెలిసింది.

ఘనంగా సంగీత్ కార్యక్రమం

ఘనంగా సంగీత్ కార్యక్రమం

మంగళవారం (నవంబర్ 13) సాయంత్రం దీపికా, రణ్‌వీర్ పెళ్లిలో భాగంగా సంగీత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాస్టా దివా రిసార్ట్ వేదికైంది. ఈ వేడుక కోసం ఇప్పటికే బాలీవుడ్ సింగర్ హర్షదీప్ కౌర్, సంజయ్ దాస్, బాబీ పాథక్, ఫిరోజ్ ఖాన్ బృందం సంగీత్‌లో తమ ప్రదర్శన ఇచ్చారు.

నవంబర్ 15న మరోసారి పెళ్లి

నవంబర్ 15న మరోసారి పెళ్లి

నవంబర్ 15న దీపికా, రణ్‌వీర్ పెళ్లి జరుగనున్నది. రణ్ వీర్ కుటుంబ సంప్రదాయం ఆనంద్ కరాజ్ పద్ధతిలో ఈ పెళ్లిని నిర్వహిస్తారు. ఈ పెళ్లి తంతుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతరం నవంబర్ 16న స్వదేశానికి బయలుదేరుతారు.

బెంగళూరు, ముంబైలో విందు ఏర్పాట్లు

బెంగళూరు, ముంబైలో విందు ఏర్పాట్లు

దీపికా, రణ్‌వీర్ పెళ్లి వేడుకకు సంబంధించి విందుకు బెంగళూరు లీలా ప్యాలెస్ హోటల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విందు నవంబర్ 21న జరుగుతుంది. అనంతరం నవంబర్ 28న ముంబైలో సినీ, వ్యాపార వర్గాల కోసం విందును ఏర్పాటు చేశారు. తమకు ఎవరైనా గిఫ్టులు అందించాలనుకొంటే, వాటిని డొనేషన్ల రూపంలో లివ్ లాఫ్ లైఫ్ ఫౌండేషన్‌కు ఇవ్వండి అని దీపిక రిక్వెస్ట్ చేసింది. మానసిక ఆరోగ్యం కోసం ఈ స్వచ్ఛంద సంస్థ సేవలందిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X