ఎట్టకేలకు దీపికా, రణ్‌వీర్ పెళ్లి ఫొటో రిలీజ్.. ఫుల్ రొమాంటిక్ మూడ్‌లో అదుర్స్!
Recommended Video

బాలీవుడ్ ప్రేమ జంట దీపికా పదుకొన్, రణ్‌వీర్ సింగ్ ఒక్కటయ్యారు. నవంబర్ 14న కొంకణి వివాహ పద్దతిలో, నవంబర్ 15న సంప్రదాయ సింధీ పెళ్లి పద్దతిలో దంపతులుగా మారారు. వీరి వివాహానికి ఇటలీలోని లేక్ కోమో వేదికైన విషయం తెలిసిందే.

కట్టుదిట్టమైన భద్రత మధ్య
దీపికా, రణ్‌వీర్ పెళ్లి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. మీడియాను దరిదాపుల్లోకి వెళ్లకుండా కట్టడి చేశారు. దాంతో వారి పెళ్లికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు లీక్ కాలేదు. దాంతో ఎప్పుడు వారి పెళ్లి ఫొటోను అధికారికంగా రిలీజ్ చేస్తారా అని ఎదురుచూపులు మొదలయ్యాయి.

అధికారికంగా పెళ్లి ఫోటో
గురువారం నవంబర్ 15వ తేదీ సాయంత్రం దీపిక, రణ్‌వీర్ పెళ్లి ఫోటోలను అధికారికంగా విడుదల చేశారు. ఆనందంలో మునిగి.. మెడలో హారం వేసేందుకు రణ్‌వీర్ సిద్ధంగా ఉండగా.. అంతే సంతోషంలో దీపికా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.

వధూవరులు గుసగుసలాడుతూ..
మరో ఫోటోలో దీపిక, రణ్‌వీర్ చాలా రొమాంటిక్ కనిపించారు. వీరిద్దరూ పెళ్లి దుస్తుల్లో గుసగుసలాడుతూ ఆకట్టుకొన్నారు. రణ్ వీర్ కుటుంబ సంప్రదాయం సింధూ మతంలోని ఆనంద్ కరాజ్ పద్ధతిలో ఈ పెళ్లిని నిర్వహించారు. ఈ పెళ్లి తంతుకు భారీగా ఏర్పాట్లు జరిగాయి.

16న స్వదేశానికి ప్రయాణం
పెళ్లి తంతు ముగించుకొని నవంబర్ 16న కొత్త దంపతులు స్వదేశానికి బయలు దేరుతారు. దీపికా, రణ్‌వీర్ పెళ్లి వేడుకకు సంబంధించి విందుకు బెంగళూరు లీలా ప్యాలెస్ హోటల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విందు నవంబర్ 21న జరుగుతుంది. అనంతరం నవంబర్ 28న ముంబైలో సినీ, వ్యాపార వర్గాల కోసం విందును ఏర్పాటు చేశారు.

స్వచ్ఛంద సంస్థకు గిఫ్టులు
పెళ్లి విందులోనూ దీపికా స్వచ్ఛంద సేవకు అవకాశం కల్పించింది. తమకు ఎవరైనా గిఫ్టులు అందించాలనుకొంటే, వాటిని డొనేషన్ల రూపంలో లివ్ లాఫ్ లైఫ్ ఫౌండేషన్‌కు ఇవ్వండి అని దీపిక రిక్వెస్ట్ చేసింది. మానసిక ఆరోగ్యం కోసం ఈ స్వచ్ఛంద సంస్థ సేవలందిస్తున్నది.


Click it and Unblock the Notifications











