దీపిక-రణవీర్ వెడ్డింగ్: 75 గదులు, సీ ప్లెయిన్లో రణవీర్ ఎంట్రీ... పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?

Recommended Video

Deepika - Ranveer Wedding : Total Budget Of The Marriage In Lake Como | Filmibeat Telugu

రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ వివాహ వేడక మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఇటలీలోని లేక్ కోమోలో నవంబర్ 14, 15 తేదీల్లో సాంప్రదాయ బద్దంగా వీరి పెళ్లి జరుగబోతోంది. లేక్ కోమోలోని విల్లా దెల్ బాల్బియానెల్లో వీరి వివాహం జరుగబోతోంది.

దీపిక కుటుంబం, రణవీర సింగ్ ఫ్యామిలీ ఆదివారం లేక్ కోమో చేరుకున్నారు. అయితే వారు వెడ్డింగ్ డెస్టినేషన్ విల్లా దెల్ బాల్బియానెల్లో‌లో స్టే చేయడం లేదు. 14, 15 తేదీల్లో మాత్రమే ఈ విల్లాను బుక్ చేశారట. లేక్ కోమో తూర్పు పాత్రంలోని ఓ లగ్జరీ రిసార్టులో స్టే చేస్తున్నారు. వివాహ వేడుక కోసం వారం రోజుల పాటు రిసార్ట్ మొత్తాన్ని బుక్ చేశారట.

విలాసవంతమైన సౌకర్యాలు

విలాసవంతమైన సౌకర్యాలు

నవంబర్ 17వ తేదీ వరకు దీపిక-రణవీర్ ఈ రిసార్ట్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సార్టులో మొత్తం 75 గదులుర, నాలుగు రెస్టారెంట్లు, బార్లు ఉన్నాయట. నాలుగు కాన్ఫరెన్స్ హాల్స్, ఒక స్పా, ఇండోర్ స్మిమ్మింగ్ పూల్, ఔట్ డోర్ ఫ్లోటింగ్ పూల్, చుట్టూ లగ్జరీ 26వేల చదరపు మీటర్లలో లగ్జరీ బొటానికల్ పార్క్ లాంటి సౌకర్యాలతో విలాసవంతంగా ఈ విల్లా ఉంది.

ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా?

ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా?

ఈ విలాసవంతమైన రిసార్ట్ కోసం దీపిక-రణవీర్ భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్కో రూము రెంటు రోజుకు 400 యూరోలు(రూ. 33 వేలు), 75 రూములకు రోజుకు రూ. 24,75,000 లక్షలు ఖర్చు చేస్తున్నారు. మొత్తం వారం రోజుల పాటు ఈ రిసార్ట్ బుక్ చేశారు... ఇందుకోసం టోటల్ రూ. 1,73,25,000 ఖర్చు చేశారట.

నీటిపై ల్యాండ్ అయ్యే విమానంలో రణవీర్

నీటిపై ల్యాండ్ అయ్యే విమానంలో రణవీర్

పెళ్లి వేదిక వద్దకు రణవీర్ సింగ్ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండబోతోందని, నీళ్లపై ల్యాండ్ అయ్యే మినీ ప్లేన్‌లో వివాహ వేడుక వద్దకు రాబోతున్నాడని తెలుస్తోంది. ఈ విమానంలో రణవీర్‌తో పాటు 14 మంది ఈ విమానంలో వివాహ వేడుక వద్దకు చేరుకుంటారు.

అతిథులంతా నీటి మార్గంలో

అతిథులంతా నీటి మార్గంలో

ఇక విడిది గృహం నుంచి అతిథులు అంతా నీటి మార్గం ద్వారా వివాహ వేదిక వద్దకు చేరుకోబోతేన్నారు. ఇందుకోసం రణబీర్ కపూర్ లగ్జరీ యాచ్(బోటు) బుక్ చేసినట్లు తెలుస్తోంది. వివాహ వేడుక ఒక రోజు రణబీర్ కుటుంబ సాంప్రదాయ ప్రకారం సింధీ స్టైల్‌లో, మరొక రోజు దీపిక కుటుంబ సాంప్రదాయం ప్రకారం కొంకణి స్టైల్‌లో జరుగబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X